For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రేణు దేశాయ్ బర్త్‌డే స్సెషల్, పవన్ కోసం త్యాగం...(ఫోటోలు)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్‌తో ఆమె సహజీవనం, అనంతరం వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటుంన్నారు రేణు. నేడు రేణు దేశాయ్ పుట్టిన రోజు. నేటితో ఆమె 34వ వడిలోకి అడుగు పెడుతున్నారు.

  మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో డిసెంబర్ 4, 1981లో దేశాయ్ జన్మించింది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘జేమ్స్ పాండు' చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

  ‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయి పిల్లలతో వేరుగా ఉంటోంది.

  పవన్ కళ్యాణ్ కోసం త్యాగం

  పవన్ కళ్యాణ్ కోసం త్యాగం


  పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడ్డాక రేణు దేశాయ్ తన సినిమా కెరీర్‌‍ను ఆయన కోసం త్యాగం చేసింది. బద్రి తర్వాత ఆమె ఇతర హీరోల సినిమాల్లో నటించలేదు. మళ్లీ 2003లో పవన్ కళ్యాణ్‌తో ‘జానీ' చిత్రంలో నటించింది.

  పవన్‌తో సహజీవనం

  పవన్‌తో సహజీవనం


  పవన్ కళ్యాణ్‌తో రేణు దేశాయ్ సహజీవనం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. వీరు పెళ్లి చేసుకోకుండానే 2004లో అకీరాకు జన్మనిచ్చారు.

  2009లో వివాహం

  2009లో వివాహం


  పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు.

  కాస్ట్యూమ్ డిజైనర్‌గా

  కాస్ట్యూమ్ డిజైనర్‌గా


  నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.

  ఇద్దరు సంతానం

  ఇద్దరు సంతానం


  పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పెట్టారు. కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యా

  ఎన్నో రూమర్లు

  ఎన్నో రూమర్లు


  పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ బంధంపై తరచూ మీడియాలో రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ ఆధారం లేని వార్తలే అని అనేక సందర్భాల్లో తేటతెల్లం అయ్యాయి. తన పర్సనల్ విషయాల గురించి మీకెందుకు అని ఓ సినిమాలో పవన్ కళ్యాన్ మీడియాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

  నిర్మాతగా, దర్శకురాలిగా రేణు దేశాయ్

  నిర్మాతగా, దర్శకురాలిగా రేణు దేశాయ్


  రేణు దేశాయ్ నిర్మాతగా మారి ‘మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. తర్వాత ‘ఇష్క్ వాలా లవ్' అనే చిత్రానకి దర్శకత్వం వహించారు.

  పవన్ సినిమాల వల్లనే...

  పవన్ సినిమాల వల్లనే...


  గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ వైఫ్ నుంచి ఇండి పెడెంట్ నిర్మాతగా ఎలా మారారు? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ.....‘ఈ మార్పు అనేది చాలా స్మూత్‌గా జరిగింది. పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఇండస్ట్రీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్టు, స్టోరీ, మ్యూజిక్ సిట్టింగ్స్‌తో ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో ఇన్ వాల్వ్ అయ్యాను. ఇందుకు పవన్‌కు థాంక్స్ చెప్పాలి' అని చెప్పుకొచ్చారు.

  ఆయన సాయం లేకుండా

  ఆయన సాయం లేకుండా


  నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాక ఆయన(మాజీ భర్త పవన్) హెల్ప్ లేకుండానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. అడిగితే ఆయన అన్ని విధాలా అండగా ఉంటారు. కానీ నేను దీన్ని చాలెంజ్ గా తీసుకున్నాను. ఈ దారిలో ఒంటరిగా ప్రయాణించాలని డిసైడ్ అయ్యాను. స్క్రిప్టు ఎంచుకోవడం, ఆర్టిస్టులను కలవడం, మ్యూజిక్ డైరెక్టర్లను కలవడం, ఇలా అన్ని విషయాలు సొంతగా చూసుకుంటున్నాను. నా భార్య మిమ్మల్ని కలవడానికి వస్తుంది...అని పవన్ నన్ను రికమండ్ చేయడు' అని వెల్లడించారు.

  పురుషాధిక్య ప్రపంచంలో

  పురుషాధిక్య ప్రపంచంలో


  సినిమా ఇండస్ట్రీ అంటేనే పురుషాధిక్య ప్రపంచం. ఇలాంటి పరిశ్రమలో మీకేమైనా చాలెంజ్ ఎదురైందా? అనే ప్రశ్నకు రేణుదేశాయ్ స్పందిస్తూ...‘సినిమా అంటేనే వ్యాపారం. ఏ రంగంలో అయినా పోటీ సహజమే. కొన్ని సవాళ్లను ఎదుర్కనాల్సి వస్తుంది. నేను పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్‌ను కాబట్టి నాతో సినిమాలు చేయడానికి అంతా ముందుకు వస్తారని అనుకోవడం లేదు. పెద్ద పెద్ద యాక్టర్లు నా వ్యూ పాయింట్ ను అర్థం చేసుకుంటున్నారు. నేను సరైన దారిలోనే వెలుతున్నానని అనుకుంటున్నాను' అని వెల్లడించారు.

  పిల్లల పెంపకం

  పిల్లల పెంపకం


  పిల్లల పెంపకంలో రాజీపడను తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ...నిర్మాతగా, దర్శకురాలిగా కెరీర్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు రేణుదేశాయ్ స్పందిస్తూ ‘కెరీర్‌తో పిల్లల కోసం కూడా సమయం కేటాయించడం నా బాధ్యత. రోజులో కనీసం ఒకసారైనా వారితో కలిసి భోజనం చేస్తాను. తల్లిగా నా బాధ్యతలు నిర్వహించడంలో రాజీపడే ప్రసక్తే లేదు' అని వెల్లడించారు.

  English summary
  Renu Desai turns 34 today. Renu Desai is former Indian model and also an actress of Tollywood. She is the wife of Power Star Pawan Kalyan. She is born on 4th December in 1981 at Pune.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X