twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్త్ డే స్పెషల్: రాజమౌళి గురించి మీకు తెలియని విషయాలు!

    దర్శకుడు రాజమౌళి పుట్టినరోజు నేడు. నేడు 44వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Birthday Special : Intresting Facts About SS Rajamouli

    ఎస్. ఎస్. రాజమౌళి... తెలుగు చలనచిత్ర ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ప్రేక్షకులకు కూడా పరిచయం అక్కర్లేని పేరు. 2001లో స్టూడెంట్ నెం.1 సినిమా ద్వారా దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి, అపజయం అంటూ ఎరుగని దర్శకుడిగా సక్సెస్ ఫుల్ జర్నీ సాగిస్తున్న ఆయన 'బాహుబలి' ప్రాజెక్టుతో దేశం గర్వించదగ్గ ఫిల్మ్ మేకర‌గా పేరు తెచ్చుకున్నారు.

    ఈ రోజు(అక్టోబర్ 10) రాజమౌళి పుట్టినరోజు. నేడు ఆయన 44వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ప్రముఖ సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడైన రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు వద్ద శిష్యురికం మొదలు పెట్టిన రాజమౌళి ఆ తర్వాత అంచెలంచలుగా ఎదిగారు.

    రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియని కొన్ని విషయాలు...

    రాజమౌళి పుట్టింది కర్నాటకలో

    రాజమౌళి పుట్టింది కర్నాటకలో

    రాజమౌళి పుట్టింది కర్నాటకలోని రాయచూర్‌లో. ఆయన హోమ్ టౌన్ పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం.

    టీవీ సీరియల్ దర్శకుడిగా

    టీవీ సీరియల్ దర్శకుడిగా

    రాజమౌళి మొదటగా ఈటీవీలో ప్రసారమైన శాంతి నివాసం అనే డైలీ సీరియల్ డైరెక్టర్ గా పని చేశారు. తర్వాత 2011లో వచ్చిన స్టూడెంట్ నెం.1 సినిమా ద్వారా సినిమా దర్శకుడయ్యారు.

    ప్రేమ వివాహం

    ప్రేమ వివాహం

    చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.... కార్తికేయ రాజమౌళి బయోలాజికల్ సన్ కాదు. రమ మొదటి వివాహం ద్వారా కలిగిన సంతానమే కార్తికేయ. అప్పటికే పెళ్లయి, ఒక కొడుకు ఉన్న డైవర్సీ రమను రాజమౌళి ప్రేమ వివాహం చేసుకున్నారు. రమ మరెవరో కాదు.... రాజమౌళి కజిన్ కీరవాణి భార్య, శ్రీవళ్లికి స్వయాన చెల్లెలు. రాజమౌళి, రమ వివాహం 2001లో చాలా సింపుల్ గా జరిగింది.

    ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం

    ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం

    రాజమౌళి ఎప్పుడూ పనిలోనే ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఆయన వర్క్ మీద ఎంత ఫోకస్ ఉంటుందో ఫ్యామిలీ అన్నా అంతే ఇష్టంగా ఉంటారు. ఆయనకు సినిమాలు, ఫ్యామిలీ తప్ప మరో లోకం ఉండదు.

    కొత్త సినిమా ఆలోచనలు

    కొత్త సినిమా ఆలోచనలు

    రాజమౌళి ప్రతి సినిమా అయిపోగానే రిలాక్స్ అవ్వానికి వెకేషన్ వెళతాడు. అక్కడే తన తర్వాతి సినిమాకు సంబంధించిన ఆలోచన మొదలవుతుంది. తనకు వచ్చిన ఆలోచన ముందు ఆయన తన భార్య రమతోనే ముందుగా పంచుకుంటారు.

    మతిమరుపు ఎక్కువ

    మతిమరుపు ఎక్కువ

    రాజమౌళి కాస్త మతిమరుపు కూడా ఉంది. పనిలో పడిపోతే మిగతా విషయాలు అన్ని మరిచిపోతారు. కొన్ని సార్లు తనకు తెలియకుండానే వేరొకరి వస్తువులు జేబులో వేసుకొస్తుంటారట. సినిమా చేస్తున్నంత సేపూ అది పూర్తయ్యే వరకు అయోమయంగా ఉంటారు.

    అందులో చాలా వీక్

    అందులో చాలా వీక్

    రాజమౌళి ఫైనాన్స్ మేనేజ్మెంటులో చాలా వీక్. అన్నీ ఆయన భార్య రమ ప్లాన్ చేయాల్సిందే. చెక్కుల మీద కూడా సరిగా సంతకం పెట్టడం రాదు. ఆయన సంతకం ఒక్కోసారి ఒక్కోలా వస్తుండటంతో చాలా సార్లు చెక్కులు రిజక్ట్ అవుతుండటంతో చెక్ అథారిటీ కూడా ఆయన భార్యే తీసుకున్నారు.

    కార్తికేయను యాక్సెప్ట్ చేశాడు

    కార్తికేయను యాక్సెప్ట్ చేశాడు

    కార్తికేయకు రాజమౌళి సొంత తండ్రి కాక పోయినా....తనకుగానీ, మాకు గానీ హి ఈజ్ నాట్ హిస్ బయోలాజికల్ సన్ అనే మాట రాదు. చిన్నప్పటి నుండి హి యాక్సెప్టెడ్ హిమ్, మా పెంపకం కూడా అలానే ఉంది... అని రమా రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

    17 సంవత్సరాల్లో కేవలం 11

    17 సంవత్సరాల్లో కేవలం 11

    17 సంవత్సరాల రాజమౌళి సినిమా కెరీర్లో కేవలం 11 సినిమాలు మాత్రమే చేశారు. అయితే వరుస విజయాలు, భారీ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్లతో ఆయన టాలీవుడ్లో నెం.1 దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

    పద్మశ్రీ

    పద్మశ్రీ

    2016లో రాజమౌళి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మక బిరుదు పద్మశ్రీని పొందారు. ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు అందుకున్నారు.

    ఇంట్లో ఆయన్ను నంది అంటారు

    ఇంట్లో ఆయన్ను నంది అంటారు

    కుటుంబ సభ్యులు రాజమౌళిని నంది అని పిలుస్తారు. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ జక్కన్న అని పిలుస్తారు. తమ ఇంట్లోని పిల్లలంటే రాజమౌళి భయపడిపోతారు. ఆయన మీద కాదు, ఆయన సినిమాల మీద పిల్లలంతా కలిసి విమర్శలు చేస్తారు. అందుకే రాజమౌళి బయ పడిపోతాడు. రాజమౌళి కుటుంబం మొత్తం ఓకే అపార్టుమెంటులో ఉంటారు.

    English summary
    Director SS Rajamouli turned 44 today. It is a special birthday for the South Indian hit filmmaker as this year he became one of the noted filmmakers among the global audience, courtesy Baahubali: The Conclusion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X