నిన్న బాబాయ్ ఈ రోజు అబ్బాయ్..సంబరం!

'లీడర్' చిత్రం ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసిన రాణా ఆ వెంటనే హిందీలో అవకాశం దక్కించుకుని దమ్ మారో దమ్ చిత్రంలో హాట్ బేబీ బిపాస బసుతో రొమాంటిక్ రోల్ పోషించి మంచి మార్కులే కొట్టేశారు. ఆతర్వాత వచ్చిన నేను నా రాక్షసి కాస్త నిరాశ పరిచినా...వరుస అవకాశాలతో దూసుకెలుతున్నాడు రాణా. ప్రస్తుతం రాణా హిందీలో 'డిపార్టుమెంట్' చిత్రంతో పాటు, తెలుగులో నాఇస్టం, కృష్ణం వందే జగద్గురుమ్, తమిళంలో 'వాడ చెన్నయ్' చిత్రాల్లో నటిస్తున్నాడు.
రాణా ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ....వన్ ఇండియా తరుపున రాణాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











