ప్రత్యేక పరిచయం చేయక్కర్లేని ప్రముఖులు వారిద్దరూ. అలాగే కూడబలుక్కున్నట్లు వాళ్ళిద్దరూ ఇవాళే (June 2nd) పుట్టారు. వారే ఇండియన్ సినిమాను తమ దైన శైలితో ప్రతిభతో ముందుకు తీసకువెళ్ళిన మణిరత్నం,ఇళయరాజా లు . ప్రముఖలైన వీళ్ళిధ్దరూ పుట్టినరోజు విషయంలోనే కాక చాలా గొప్ప విషయాల్లో కలుస్తారు .అంతేగాక వీళిద్దరూ కలసి పనిచేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్టే. ఆ పాటలు, వాటికి సమకూర్చిన విజువల్స్ ఇప్పటికీ అందరిమదిలో మధుర స్మృతులుగా మిగిలాయి. అలాగే ఇద్దరూ తమిళులు అయినప్పటికీ ఇద్దరూ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకోవటం మరో విషేషం. మళ్ళీ వీరిద్దరూ కలసి సినిమా చేయాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని దట్స్ తెలుగు ఆశిస్తోంది.