హ్యాపీ బర్తడే టూయూ బాలూ...

అది మొదలు తెలుగు, తమిళ ,మళయాళ, హిందీ,తుళు,బెంగాళి భాషల్లో ఆయన 40 వేలకు పైగా పాటలు పాడారు ...పాడుతూనే ఉన్నారు. అంతే గాక సంగీత దర్శకుడుగానూ 55 చిత్రాలకు పనిచేసి మధురమైన సంగీతాన్ని అందించారు. ఇక నటుడుగా 'మహ్మద్ బీన్ తుగ్లక్' చిత్రంతో తెరంగ్రేటం చేసి ఇప్పటి వరకూ దాదాపు 70 సినిమాల్లో నటించారు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టుగా 'మన్మధ లీల' తో ప్రారంభించి కమల్ హాసన్, భాగ్యరాజా, కుల్ భూషన్ కర్భందా, పరేష్ రావెల్, విసు, టి.రాజేందర్ తదితరులుకు గాత్రదానం చేసి వారి సినిమా విజయాలలో మేజర్ షేర్ పొందారు. ఇప్పుడు ప్రైవేట్ ఛానెల్స్ లో సంగీత ఆధారిత పోగ్రాములలో పాలు పంచుకుంటూ భావి తరాలుకు తన దైనశైలిలో సలహాలు ఇస్తూ...సందేహాలు తీరుస్తూ ముందుకు వెళ్తున్నారు. అలా గాయకుడిగా ...సంగీత దర్శకుడుగా...నటుడుగా...డబ్బింగ్ ఆర్టిస్టుగా...నిర్మాతగా సినీ పరిశ్రమకు అలుపనేది లేకుండా నిరంతరంగా సేవలు అందిస్తూనే ఉన్న ఈ గాన గంధర్వుడుకి దట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











