గలీజ్ పని చేసినవా? దాక్కుంటే ఎట్లా? .... యాంకర్ ప్రదీప్‌పై బిత్తిరి సత్తి!

By Bojja Kumar

Recommended Video

యాంకర్ ప్రదీప్‌పై బిత్తిరి సత్తి సెటైర్లు !

ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అంటే... పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా. అయితే ఆ సినిమా విడుదల ముందు టాలీవుడ్లో ప్రముఖ యాంకర్ ప్రదీప్ అజ్ఞాతవాసంలోకి వెళ్లడం చర్చనీయాంశం అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ప్రదీప్ గురించి టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో పోలీసులకు దొరకకుండా ప్రదీప్ రహస్య ప్రదేశంలో దాక్కున్నాడని అంటున్నారు.

 బిత్తిరి సత్తి షోలో ప్రదీప్ ప్రస్తావన

బిత్తిరి సత్తి షోలో ప్రదీప్ ప్రస్తావన

‘తీన్ మార్' వార్తలతో తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో పాపులర్ అయిన బిత్తిరి సత్తి తాజాగా తన షోలో ప్రదీప్ ప్రస్తావన తెచ్చాడు. అతడు ఎవరికీ కనిపించకుండా పోయిన వైనాన్ని గుర్తు చేస్తూ బిత్తిరి సత్తి పేల్చిన సెటైర్లు అందరినీ నవ్విస్తున్నాయి.

 అజ్ఞాతవాసి సినిమా చూద్దామనుకున్నాం....

అజ్ఞాతవాసి సినిమా చూద్దామనుకున్నాం....

త్వరలో అజ్ఞాతవాసి సినిమా విడుదలవ్వబోతోంది. ఇద్దరం కలిసి సినిమా చూద్దాం అనుకున్నాం. కానీ నువ్వు ఇలా అజ్ఞాతంలోకి వెళితే ఎలా? ...... ఎక్కడున్నావ్, త్వరగా వచ్చేయ్ అంటూ బిత్తిరి సత్తి కామెడీ పండించాడు.

వచ్చేయ్ రాజా

వచ్చేయ్ రాజా

తనదైన మేనరిజం, నవ్వించే యాస‌లో యాంకర్ ప్రదీప్‌ను ఒక రేంజిలో ఆడుకున్నాడు బిత్తిరి సత్తి. ఎక్కడున్నావ్ రాజా... ఎక్స్ ప్రెస్ ఎక్కి వచ్చేయ్ రాజా... టచ్‌లోకి రా రాజా అంటూ నవ్వులు పూయించారు.

 ఎంత పనైపాయే...

ఎంత పనైపాయే...

డిసెంబర్ 31 అంటేనే ఖుషి దినం. ఆ యాళ కొంచెం సుక్కేసిండు, ఇస్టీరింగ్ పట్టి తిప్పిండు....ఎస్కలేటర్ తొక్కిండు సక్కగ పోయ్ పోలీసోళ్ల ముంగట ఆపిండు, ఎంతపనైపాయే.... అంటూ బిత్తిరి సత్తి ఫన్ క్రియేట్ చేశాడు.

ప్రదీప్ పెద్ద తప్పు, నేరం, ఘోరం ఏం జేసిండు?

ప్రదీప్ పెద్ద తప్పు, నేరం, ఘోరం ఏం జేసిండు?

ప్రదీప్ పెద్ద తప్పు, నేరం, ఘోరం ఏం జేసిండు? కోహినూర్ వజ్రం ఎత్తుకుపోయినంత ఫీలైపోయి ఎక్కడో పోయి దాక్కుంటే ఎట్లా? పోలీసులు ఇంటికెళ్లినా తాళం వేసే ఉన్నదంట, ఆఫీసుల కూడా లేడంట, ఆయన ఎవడిదైనా మందు గుంజుకుని తాగిండా? తన సొమ్ము తను కూడా తాగనీకి, తిననీకి లేకుండా అయిపోయింది జమానా... అంటూ తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశాడు బిత్తిరి సత్తి.

 అప్పుడు నీతులు చెప్పాడు...

అప్పుడు నీతులు చెప్పాడు...

ఈ షోలో మరో యాంకర్ సావిత్ర మాట్లాడుతూ.... గతంలో ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ప్రచారం చేశాడని, అలాంటి వ్యక్తి ఇపుడు ఇలా చేయొచ్చా? తప్పుకదా? అంటూ వ్యాఖ్యానించారు.

 తాగుడు ఒక షో అనుకుంటే సరిపోతుంది

తాగుడు ఒక షో అనుకుంటే సరిపోతుంది

యాంకర్ ప్రదీప్ చాలా టీవీ షోలు చేస్తున్నాడు. దీన్ని కూడా ‘తాగి దొరుకుడు షో‘ అనుకుంటే సరిపోతుంది. గలీజ్ పనులు చేసి దొరికిన గజల్ శ్రీనివాసే ఎలాంటి భయం లేకుండా మీడియా ముందు స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు..... అలాంటి కేవలం తాగి దొరికిపోయిన ప్రదీప్ దాక్కోవడం ఎందుకు? అంటూ బిత్తిరి సత్తి కామెంట్ చేశాడు.

తప్పయింది అంటే సరిపోయేది

తప్పయింది అంటే సరిపోయేది

యాంకర్ ప్రదీప్ జనాల్లోకి వచ్చి.... ఇప్పుడైతే తాగి తప్పు చేశాను, మళ్లీ జిందగీలో తాగను అంటే అయిపోతుండే... ఇలా దాక్కోవడం వల్ల మీడియాలో బదనాం అవుతుండే. ఇప్పటికైనా యాంకర్ ప్రదీప్

బయటకు రావాలి... అని బిత్తిరి సత్తి వ్యాఖ్యానించారు.

ఎవరినైనా గుద్దితే నేను ఊరుకుంటనా?

ఎవరినైనా గుద్దితే నేను ఊరుకుంటనా?

ఏడాదిలో ఒక్కదినం డిసెంబర్ 31. తాగి ఎవరినైనా గుద్దిండా? గుద్దితే నేను ఊరుకుంటానా? ప్రదీప్ అన్నా ఎడున్నవే ఇక వచ్చేయ్.... నేనున్నాను రా.... మందు ఎక్కువైతే పండుకుని బొర్లాడుదాం కానీ ఈ బండ్ల మీద పోనే పోవద్దు.... అంటూ బిత్తిరి సత్తి కామెడీ పండించారు.

అతిగా మద్యం సేవించిన ప్రదీప్

అతిగా మద్యం సేవించిన ప్రదీప్

డిసెంబర్ 31వ తేదీ రాత్రి బ్రీత్ ఎనలైజర్‌తో పోలీసులు ప్రదీప్‌ను పరీక్షించగా.... 178 పాయింట్లు చూపించింది. దీన్ని బట్టి సాధారణ స్థాయి కంటే ప్రదీప్ నాలుగైదు రెట్లు ఎక్కువ మద్యం సేవించాడని తేలిపోయింది.

జైలు శిక్షపై చర్చ

జైలు శిక్షపై చర్చ

ప్రదీప్ సేవించిన మద్యం మోతాదుకు గాను ఆయనకు దాదాపు వారం రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీని గురించి ఆసక్తికర చర్చ సాగుతుంది.

 చార్జ్ షీట్ దాఖలైంది

చార్జ్ షీట్ దాఖలైంది

సాంకేతికంగా ప్రదీప్‌కు శనివారం వరకూ కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. అయితే పోలీసులు కౌన్సిలింగుకు హాజరు కావాలని చెప్పినపుడు హాజరవ్వాలి. కానీ ప్రదీప్ అలా చేయలేదు. అతడు కౌన్సిలింగుకు హాజరు కాని విషయాన్ని కూడా పోలీసులు చార్జి షీట్లో పేర్కొన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X