Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిత్తిరి సత్తి ఇక కనిపించడా??? V6 కి సత్తి రాజీనామా..!
"తీన్ మార్" ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియాస్ రవి, తాను మొదటి నుంచి పని చేస్తున్న "వీ6" చానల్ కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
Recommended Video
తనదైన శైలిలో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, 'తీన్ మార్' ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియాస్ రవి, తాను మొదటి నుంచి పని చేస్తున్న 'వీ6' చానల్ కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. బిత్తిరి సత్తి.. బెల్లితెరపై బిత్తిరి సత్తిగా అందరికీ సుపరిచితమైన సత్తి అసలు పేరు చేవేళ్ల రవి.
"V6"చానల్ కు రాజీనామా
రంగారెడ్డి జిల్లా పమేనా గ్రామానికి చెందిన వాడు. చిన్నతనం నుండి ప్రముఖులను ఇమేట్ చేస్తూ అందరినీ ఎంటర్టెన్ చేసేవాడు. అతనిలోని ఆ టాలెంటే ఇపుడు అతన్ని పెద్ద సెలబ్రిటీ చేసింది.. తనదైన శైలిలో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ‘తీన్ మార్' ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి తాను మొదటి నుంచి పని చేస్తున్న ‘వీ6' చానల్ కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది..
కారణం ఏంటి..?
నిన్న తీన్మార్ కార్యక్రమంలో కూడా బిత్తిరి సత్తి కనిపించలేదు.. దీంతో ఈ అనుమానం మరింత బలపడింది.. అసలు బిత్తిరి సత్తి ఛానల్ నుండి వెళ్లిపోవడానికి కారణం ఏంటి..? చానల్ వర్గాలువెల్లడించిన వివరాల మేరకు, సత్తికి పాప్యులారిటీ పెరుగుతూ ఉండటంతో, ప్రైవేటు కార్యక్రమాలు చేసుకోవడానికీ మేనేజ్ మెంట్ అనుమతిచ్చింది.
ఉదయభాను వంటి టాప్ యాంకర్ తో
సత్తి ప్రైవేటు షూటింగ్ లకు కూడా సంస్థ కెమెరాలను తీసుకువెళుతుంటే ఏమీ అనలేదు. ఇక ఇటీవలి కాలంలో చాన్సులు పెరగడం, మరిన్ని ప్రోగ్రామ్ లకు అవకాశాలు రావడం, ఉదయభాను వంటి టాప్ యాంకర్ తో స్టేజ్ పంచుకునే అవకాశం లభించడంతో, సత్తిలోని మరో యాంగిల్ బయటకు వచ్చిందట.
గొడవ పెట్టుకుని రాజీనామా చేశాడా?
వీ6 టీమ్ ను ఎంతమాత్రమూ కేర్ చేయడం లేదని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని మేనేజ్ మెంట్ ప్రస్తావించగా, గొడవ పెట్టుకుని రాజీనామా చేశాడని సమాచారం. రూ. 2 లక్షల నెల వేతనంతో మరో ప్రముఖ చానల్ లో సత్తికి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. బిత్తిరి సత్తి చానల్ మారడంపై ప్రత్యేక కథానాన్ని చూడండి.