twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిత్తిరి సత్తా?.. మజాకా?.. విని తరించాల్సిందే: మోత మోగుతున్న కొత్త పాట(వీడియో)..

    |

    Recommended Video

    బిత్తిరి సత్తా ?.. మజాకా ? పాటతో అదరగొట్టాడు !

    అది యక్ష గానమైనా.. జానపదమైనా.. ఆఖరికి మోడర్న్ సాంగ్ అయినా.. బిత్తిరి సత్తి నోటి నుంచి పలికిందంటే.. కొన్ని దినాలు నాన్‌స్టాప్ మొబైల్ ఫోన్లల్ల మోత మోగాల్సిందే. కేవలం నటుడిగా మాత్రమే కాదు.. పాటలు పాటడంలోనూ, ఇమిటేషన్ లోనూ, మిమిక్రీలోనూ.. బిత్తిరి సత్తి టాలెంట్ మిగతా వాళ్ల కన్నా స్పెషల్ అనే చెప్పాలి.

    ఇప్పుడీ టాలెంటెడ్ పర్సనాలిటికీ మరో టాలెంటెడ్ లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్ తోడవడంతో.. ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. 'యాంటీ వైరస్' అంటూ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపుతోంది..

    'చెప్పితే విననోన్ని దేవా!..'

    'చెప్పితే విననోన్ని దేవా.. చెడంగా సూడాలె రామా!..' అంటూ బిత్తిరి సత్తి పాడిన పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిట్టపెల్లి సురేందర్ రాసిన క్యాచీ లిరిక్స్, ఆ పదాలను సత్తి పలికిన తీరు హుషారెత్తించేలా ఉన్నాయి.

     మిట్టపెల్లి సురేందర్ పాట..:

    మిట్టపెల్లి సురేందర్ పాట..:

    'చెప్పితే విననోన్ని..' అంటూ పాటను ఎత్తుకోవడం.. మధ్యలో 'బతుకుల తవ్వెడు మన్ను వోస్తే..' వంటి శాపనార్థం తరహా వాక్యాల్ని వాడటం.. ఇటీవలి కాలంలో కాస్త కొత్త ప్రయోగం లాగే అనిపిస్తుంది. వాడుకలో ఉన్న పదాలతోనే క్యాచీ లిరిక్స్ అల్లడంలో మిట్టపెల్లి సురేందర్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

     సోషల్ మీడియా ప్రేమలపై..:

    సోషల్ మీడియా ప్రేమలపై..:

    సోషల్ మీడియా ప్రేమలకు కౌంటర్‌గా సాగుతుంటుంది ఈ పాట. నిత్యం ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో గర్ల్ ఫ్రెండ్‌తో చాట్ చేసేవాళ్లకు.. చివరకు ఎలాంటి షాక్ తగులుతుందనే ఒక సరదా కాన్సెప్టుతో పాట రాసుకున్నట్లు అర్థమవుతోంది.

    యాంటీ వైరస్-2..??:

    యాంటీ వైరస్-2..??:

    అయితే ఈ యాంటీ వైరస్ కేవలం పాటకే పరిమితమా?.. లేక వెబ్ సిరీస్ లాంటిదేమైనా చేస్తున్నారా? అన్న దానిపై స్పష్టత లేదు. పాట చివరలో.. యాంటీ వైరస్-2 అంటూ 'క్లూ' ఇచ్చారు. దీన్నిబట్టి మరో పాట కూడా త్వరలోనే యూట్యూబ్‌ను హిట్ చేస్తుందేమో!.

     హోరెత్తడం ఖాయం:

    హోరెత్తడం ఖాయం:

    ఏదేమైనా.. డిసెంబర్ 31 రాత్రి డీజే పాటలతో హోరెత్తిపోయే జనాలకు ఈ పాట కూడా తోడవుతుందనడంలో సందేహం లేదు. మొత్తానికి బిత్తిరి సత్తి, మిట్టపెల్లి సురేందర్ కలిసి ఈ పాటతో ఒక ఊపు ఊపుతున్నారు.

    English summary
    Bithiri Sathi Anti Virus Song released For New Year.Song written by Lyricist Mittapalli Surender On the eve of Happy New Year 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X