For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగర్‌గా బిత్తిరి సత్తి కేక.. దుమ్మురేపుతున్న బ్రీత్‌లెస్ పాట!

    |

    బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆ బాలుడు కాస్త కుర్రాడిగా మారి హీరోగా రూపాంతరం చెంది నాలుగు సినిమాలు చెసేశాడు.నటుడిగా 25 సం.లు పూర్తి చెసుకొబొతొన్న ఆ కుర్రాడీ పేరు దిలీప్‌కుమార్ స‌ల్వాది . దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దిక్సూచి". డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రం ఆడియోను బుధ‌వారం సాయంత్రం ఆడియోను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో...

    ఒక్క పాట వినే ఫిక్స్ అయ్యారు

    ఒక్క పాట వినే ఫిక్స్ అయ్యారు

    మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌ద్మ‌నాభ్ మాట్లాడుతూ.. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. ఆయ‌న నా మొద‌టి పాట విని ఈయ‌నే నా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని ఫిక్స్ అయ్యారు. అలాగే వాళ్ళ నాన్న‌గారు కూడా నాకు చాలా స‌పోర్ట్‌ని అందించారు.భ‌ర‌ద్వాజ్ నువు చెయి నీ వెనుక నేను ఉన్నాను అని అన్నారు.ఇది చాలా మంచి స్టోరీ అని అన్నారు. ముందుగా నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్‌గార్‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. మంచి మ్యూజిక్ చెయి అని స‌పోర్ట్ ఇచ్చిరు. ప్ర‌తి పాట నాకు ఒక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చింది. బాంబే వెళ్ళి కైలాస్‌గారితో ఒక పాట పాడించాము. నేను మా లిరిక్‌రైట‌ర్‌గారు క‌లిసి వెళ్ళాము. అది ఒక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌. ఇందులో డివోష‌న‌ల్‌, క్లాసిక‌ల్‌, క్రైమ్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. థ్యాంక్స్ టు మై డైరెక్ట‌ర్ అండ్ ప్రొడ్యూస‌ర్‌. రీరికార్డింగ్ కూడా డైరెక్ట‌ర్‌గారు, ప్రొడ్యూస‌ర్‌గారు ప‌క్క‌న ఉండి వాళ్ళ‌కు ఏ విధంగా కావాలో అలా చేయించుకున్నారు అన్నారు.

     క‌ర్త‌, క్రియ‌, క‌ర్మ అంతా ఆయనే

    క‌ర్త‌, క్రియ‌, క‌ర్మ అంతా ఆయనే

    ఆర్టిస్ట్‌ అరుణ్ మాట్లాడుతూ... దిక్స‌చి చిత్రంలో నేను మంచి పాత్ర చేశాను (విల‌న్ పాత్ర‌). ఈ సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చినందుకు దిలీప్‌కు థ్యాంక్స్‌. అవ‌కాశం వ‌చ్చేలా చేసినందుకు నా వైఫ్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాకి క‌ర్త‌, క్రియ‌, క‌ర్మ అంతా దిలీప్‌. చాలా బాగా చేశారు. రాత్రిప‌గ‌ళ్ళు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. వాళ్ళ పేరెంట్స్‌కూడా చ‌లా స‌పోర్ట్ చేశారు. అదే విధంగా మా ప్రొడ్యూస‌ర్ గారు కూడా చాలా స‌పోర్ట్ ని అందించారు. అంద‌రూ కొత్త‌వాళ్ళ‌తో న‌టించాను అంద‌రి ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నాను. మా టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్‌. డిఓపిగారికి థ్యాంక్స్ అని అన్నారు.

    బిత్తిరి సత్తి పాటకు ఫుల్ రెస్పాన్స్

    బిత్తిరి సత్తి పాటకు ఫుల్ రెస్పాన్స్

    దిక్సూచి చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించడమే కాకుండా ఓ పాటను పాడిన బిత్తిరి సత్తి మాట్లాడుతూ.. నిర్మాత తనతో పట్టుబట్టి సినిమాలో నటింపజేశాడు. సినిమాలో నటించేలా చేయడానికి ఆస్ట్రేలియాకు రప్పించి మరీ ఒప్పించారు. అలాగే ఓ అద్భుతమైన పాటను కూడా పాడించారు. ఈ పాటకు మంచి రెస్సాన్స్ వస్తున్నది అని తెలిపారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో బిత్తిరి సత్తి పాడిన మట్టిలోన పాటకు ఆడియెన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పాట చాలా ఎమోషనల్‌గా సాగింది. భావోద్వేగంగా బ్రీత్‌లెస్‌గా బిత్తిరి సత్తి పాడిన పాట ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

    చాలా మందికి థాంక్స్ చెప్పుకోవాలి

    చాలా మందికి థాంక్స్ చెప్పుకోవాలి

    చాందిని మాట్లాడుతూ... నేను చాలా మందికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి. నాకు ఈ చిత్రంలో న‌టించేందుకు అవ‌కాశం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దిలీప్ చాలా థ్యాంక్స్‌. బ్యూటిఫుల్ టీమ్‌.ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక‌ళ్ళు క‌ష్ట‌ప‌డ్డాం కాని ఎవ్వ‌రికీ ఆ క‌ష్టాన్ని క‌నిపించ‌కుండా దిలీప్ వాళ్ళ నాన్న‌గారు చాలా బాగా చూసుకున్నారు. టీజ‌ర్ అంద‌రికి న‌చ్చిందని అనుకుంటున్నాను. రాజుగారు నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అన్నారు. అంద‌రం ఒక ఫ్యామిలీలాగా ఈ సినిమాని చేశాం అన్నారు. మా నాన్న‌గారు కూడా ఈ చిత్రంలో ఒక పాత్ర చేశారు. థ్యాంక్ యూ పాపా. అంద‌రూ త‌ప్ప‌కుండా చూసి మ‌మ్మ‌ల్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

     పిలిచి సినిమా ఇచ్చారని

    పిలిచి సినిమా ఇచ్చారని

    హీరో క‌మ్ డైరెక్ట‌ర్ దిలీప్ కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ... చాలా మంది న‌న్నుఆడియో ఫంక్ష‌న్ అన‌గానే ఏమి అడుగుతున్నారు అంటే. గెస్ట్ ఎవ‌రు అని? నాకు ఎవ్వ‌రూ గెస్ట్ వ‌ద్దు ఆడియ‌న్సే నా గెస్ట్‌లు. రాజ్‌గారు గురించి నేను ముఖ్యంగా చెప్పాలి. న‌న్ను న‌మ్మి డ‌బ్బులు పెట్టారు. ఇంత కాలం ఇండ‌స్ట్రీలో ఉండి ఏమీ చెయ్య‌లేదా అంటే క‌థ‌లు వ‌స్తున్నాయి చేస్తున్నా కాని ప్రోప‌ర్ క‌థ రావ‌టం లేదు టైంరావాలి అన్నా. స‌రే నేను నీకు టైం ఇస్తా తీసుకో అన్నారు. తీసుకున్నా అదే దిక్సూచి వ‌ల్గారిటీ లేని చిత్ర‌మిది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఫ్యామిలీతో వెళ్ళి చూసే చిత్ర‌మిది అని అన్నారు.

    సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌

    1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ ఇది.సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌. చాలా నీట్‌గా థ్రిల్లింగ్‌, డివోష‌న‌ల్‌గా ఉంటుంది. న‌న్ను స‌పోర్ట్ చేసిన అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. మా అమ్మ‌, నాన్న న‌న్ను చాలా స‌పోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా కోసం చ‌చ్చిపోతాం. అలాంటి ఫ్యామిలీ మాది. మా టెక్నీషియ‌న్స్ అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. ఇండ‌స్ర్టీలో టీమ్ వ‌ర్క్ చేసేది చాలా త‌క్కువ మంది. మా నందు కో డైరెక్ట‌ర్ నాతో చివ‌రి వ‌ర‌కు ట్రావెల్ అయ్యారు. అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ఈ సినిమా చూసి అంద‌రూ న‌న్ను ఒక స‌పోర్ట్ చెయ్యండి. దిక్స‌చి ఫౌండ‌నేష‌న్ కూడా స్టార్ట్ చేశాను. రాజు అన్న చాలా థ్యాంక్స్ అని దిలీప్ కుమార్ అన్నారు.

     నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    దిక్సూచి చిత్రంలో దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని, భ‌గ‌వనాని, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి న‌టించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వంఃదిలీప్ కుమార్ స‌ల్వాది, ప్రొడ్యూస‌ర్స్ఃన‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, కెమెరాఃజ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ః ప‌ద్మన‌వ్ భ‌ర‌ద్వాజ్‌, లిరిక్స్ః శ్రీ‌రామ్ త‌ప‌స్వీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్ష‌న్ః దిలీప్‌కుమార్ స‌ల్వాది క‌ట్స్ః దిక్సూచి స్టూడియోస్‌

    English summary
    Diksoochi movie news semi periodic film, Which is directed and acted by Dileep Kumar Salwadi. Chandini is the heroine. Bittiri Satti is the special appearence in this movie. Apart from this Bittiri Satti sing a song for This movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X