గోల్డ్‌ఫ్లేక్ సిగిరెట్‌లా..యాడ్‌లో ముఖేశ్‌లా ఉన్నావు.. క్యాథరిన్‌, కాజల్‌పై బిత్తిరి సత్తి సెటైర్

దగ్గుబాటి రానా, కాజల్, క్యాథరిన్ త్రెసా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్ర ప్రమోషన్‌లో బిత్తిరి సత్తి యాంకరింగ్ హైలెట్‌గా నిలిచింది.

By Rajababu

దగ్గుబాటి రానా, కాజల్, క్యాథరిన్ త్రెసా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్ర ప్రమోషన్‌లో బిత్తిరి సత్తి యాంకరింగ్ హైలెట్‌గా నిలిచింది. హీరోయిన్ కాజల్, క్యాథరిన్‌తోపాటు పలువురు నటులపై బిత్తిరి సత్తి వేసిన సెటైర్లు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. బిత్తిరి సత్తి వాడిన పదాలు, భాష అర్థం కాక కాజల్, క్యాథరిన్ కంగుతిన్నారు. బిత్తిరి సత్తి స్టయిల్ మార్కు కామెడీతో ఈవెంట్ ఆసక్తికరంగా సాగింది.

కాజల్‌ను ఆడుకొన్న బిత్తిరి సత్తి

కాజల్‌ను ఆడుకొన్న బిత్తిరి సత్తి

ఈ ప్రమోషన్ ఈవెంట్‌లో కాజల్ మాట్లాడి వెళ్తుండగా మేడమ్ మేడమ్ అని బిత్తిరి సత్తి పిలువడంతో చెప్పండి వెనక్కి వచ్చింది. బిత్తిరి సత్తి ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండగా తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది అనడగానికి బదులు నాకు అర్థమైంది అని కాజల్ చెప్పింది. దాంతో నేను చెప్పకముందే అర్థమైంది అనడాన్ని బట్టి నీకు తెలుగు రాదని తెలిసిపోయింది అని బిత్తిరి సత్తి సెటైర్ వేశాడు.

Recommended Video

Kajal Aggarwal Celebrates Her Birthday With Her 50th Film
విటమిన్ సాంగ్స్ చేస్తున్నావు..

విటమిన్ సాంగ్స్ చేస్తున్నావు..

టాప్ హీరోయిన్‌గా మారిన తర్వాత మధ్య మధ్యలో విటమిన్ (ఐటమ్) సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు అని అడుగగా కాజల్ అర్థం కాలేదు. దాంతో నవదీప్ వచ్చి విటమిన్ అంటే ఐటమ్ అని వివరించాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో మీది విటమిన్ క్యారెక్టరా లేదా మంచి క్యారెక్టరా అని కాజల్‌ను బిత్తిరి సత్తి అడిగాడు.

నాది ఐటమ్ పాత్ర కాదు..

నాది ఐటమ్ పాత్ర కాదు..

నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నాది ఐటమ్ గర్ల్ పాత్ర కాదు. రాధ అనే మంచి పాత్రను పోషిస్తున్నాను అని కాజల్ చెబుతుండగా.. నేను పక్కా లోకల్ లాంటి పాట చేయాలని సూచిస్తుండగా రానా కల్పించుకొని బిత్తిరి సత్తి సెటైర్లకు బ్రేక్ వేశాడు.

క్యాథరిన్‌ను వదలని బిత్తిరి

క్యాథరిన్‌ను వదలని బిత్తిరి

అలాగే క్యాథరిన్‌ను కూడా అదే పంథాలో బిత్తిరి సత్తి అడుకొన్నారు. క్యాథరిన్ అంటే నీవు ఫుడ్ సప్లయి చేస్తావా అని అడుగడంతో క్యాథరిన్ నవ్వుల్లో మునిగింది. నా పేరు క్యాథరిన్.. క్యాటరింగ్ కాదు అని వివరణ ఇచ్చింది. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో సిగరెట్లు తాగి సన్నబడ్డావు. బడా గోల్డ్ ఫ్లాక్ కింగ్ సిగరెట్‌లా కనిపిస్తున్నావు అని సెటైర్ వేశాడు.

ముఖేశ్ బదులుగా నిన్ను తీసుకొంటారేమో..

ముఖేశ్ బదులుగా నిన్ను తీసుకొంటారేమో..

సిగరెట్ తాగడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పే ముఖేశ్ ప్రకటనను ఇప్పటి వరకు చూశాం. సిగరెట్ తాగడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పే క్యాథరిన్ ప్రకటనను ఇక నుంచి చూడాల్సి వస్తుందేమో అని బిత్తిరి సత్తి తన స్టయిల్‌లో చెప్పగానే అందరూ ఘొల్లుమన్నారు.

ఎందుకు సెకండ్ హ్యాండ్ హీరోయిన్‌గా

ఎందుకు సెకండ్ హ్యాండ్ హీరోయిన్‌గా

క్యాథరిన్ కూడా ఎంజాయ్ చేస్తుండటంతో బిత్తిరి సత్తి వదలకుండా ఆమెపై జోకులు పేల్చాడు. ప్రతీ సినిమాలో సెకండ్ హ్యాండ్ హీరోయిన్‌గా ఎందుకు చేస్తున్నావు అని అడుగగానే అందరూ మరోసారి ఘోల్లుమన్నారు. అందుకు జవాబుగా క్యాథరిన్ మాట్లాడుతూ.. సెకండ్ హీరోయిన్‌ అని కాదు.. మంచి క్యారెక్టర్లు మాత్రమే చేస్తున్నాను. ఫస్ట్ హీరోయినా లేదా సెకండ్ హీరోయినా అని పెద్దగా పట్టించుకోను అని అన్నారు.

పడిపడీ నవ్విన ప్రముఖులు

పడిపడీ నవ్విన ప్రముఖులు

బిత్తిరి సత్తి మాటలకు వేదిక మీద ఉన్న ప్రముఖులతోపాటు కార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరు నవ్వుల్లో మునిగారు. ముఖ్యంగా రానా, నవదీప్, సురేష్ బాబు, కాజల్, తనికెళ్ల భరణి, పరుచూరి బ్రదర్స్ పడిపడి నవ్వడం కనిపించింది. బిత్తిరి సత్తి మాట్లాడిన ప్రతీసారి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X