నా ఇంట్లో రెండ్రోజులు ఉండు.. నిన్నుచూస్తేనే ఉత్సాహం.. తీన్మార్ యాంకర్‌తో బాబు మోహన్
పాపులర్ సీనియర్ కమెడియన్ బాబు మోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆయన కామెడీ టైమింగ్ తో కడపుబ్బా నవ్విస్తారు. ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించి హాస్య నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
ముఖ్యంగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు-బాబు మోహన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ గా ఉండేది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కమెడియన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు బాబు మోహన్.

తీన్మార్ వార్తలతో: ప్రముఖ తెలుగు కమెడియన్, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబు మోహన్ ను తీన్మార్ వార్తలతో ఫుల్ ఫేమస్ అయిన రమ్య (తీన్మార్ రాములమ్మ) తాజాగా ఇంటర్వ్యూ చేసింది. తెలంగాణ యాసతో పాటు ఆకట్టుకునే అందంతో యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం పలు ఛానెళ్లలో యాంకర్ గా పనిచేస్తున్న ఆమె పొలిటిషియన్ బాబు మోహన్ ను ఇంటర్వ్యూ ద్వారా వేసిన ప్రశ్నలకు షాకింగ్ ఆన్సర్స్ వినాల్సివచ్చింది.
పొగడ్తల వర్షం..: ఇంటర్వ్యూ ప్రారంభంలో "ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది" సార్ అని యాంకర్ రమ్య అంటే... "నిన్ను చూసిన తర్వాతే నాలో ఉత్సాహం మొదలైంది" అని బాబు మోహన్ అన్నారు. "ఏంటీ నన్ను చూశా" అని యాంకర్ అంటే.. "అవును, నిన్ను చూసే. నీ పోగ్రామ్ నాకు నచ్చింది. మీరు చెప్పే తీరు నచ్చింది" అని బాబు మోహన్ పొగ్గడ్తలు కురిపించారు. దీనికి "యాంకర్లు గెస్టులకు బిస్కెట్లు వేస్తారు. కానీ మీరే రివర్స్ నాకు బిస్కెట్ వేస్తున్నారు" అని కౌంటర్ ఇచ్చింది యాంకర్.

బూతులు తిట్టలేదా: అనంతరం ఇంటర్వ్యూలో "భారాసాలో ఉన్నప్పుడు మా బావా.. మా బావా అంటూ కేసీఆర్ ను తెగ పొగిడేవారు. ఇప్పుడు బీజేపీలో చేరగానే ఎందుకు తిడుతున్నారు? బయటకు రాగానే చెడ్డవారు అయిపోయారా? మీరు మీ కార్యకర్తలపై దుర్భాషలు ఆడింది నిజం కాదా? మీ కార్లలో డబ్బు దొరికింది నిజం కాదా? మీరు బండి సంజయ్ ను బూతులు తిట్టింది నిజం కాదా? అని వరుసగా బాబు మోహన్ పై ప్రశ్నల వర్షం కురిపించింది యాంకర్ రమ్య.
డిస్కషన్ ఇలాగే ఉంటుంది: యాంకర్ రమ్య ప్రశ్నలకు అది నా పర్సనల్ అంటూ ఫైర్ అయ్యారు బాబు మోహన్. "ఏంటీ నా ముందు తెడ్డు తిప్పుతున్నావ్.. నీకేం కావాలో నాకు తెలుసు. నీకు ఎంతవరకూ చెప్పాలో కూడా నాకు తెలుసు. నువ్వు ప్రశ్నలు మానేసి మహాభారతం అడుగుతున్నావ్" అని బాబు మోహన్ అన్నారు. "లేదు సార్.. డిస్కషన్ అంటే ఇలాగే ఉంటుంది. మనం మాట్లాడుకుంటేనే కదా ప్రజలకు మరిన్ని విషయాలు తెలిసేది" అని యాంకర్ వివరణ ఇచ్చింది.

ప్రజల్లోకి వెళ్లేది: యాంకర్ అన్నదానికి "ఏం అవసరం లేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. కావాలంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు రండి. మా ఇంట్లో ఉండు. ఒక పూట కాదు. రెండు రోజులు ఉండు. అప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇంటర్వ్యూ అనేది ప్రజల్లోకి వెళ్లేది. వాళ్లకు ఎంత వరకూ తెలియాలో అంతవరకే తెలియాలి" అని బాబు మోహన్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
కేసీఆర్ తో లక్ష ఉంటాయి..: "ఎందుకు సార్ ప్రజలకు అన్ని ముచ్చట్లు తెలియకూడదా?" అని యాంకర్ రాములమ్మ తిరిగి ప్రశ్నించడంతో.. "అన్నీ ఎందుకు చెప్తాం. నా పర్సనల్ విషయాలు నీకు ఎందుకు? ఏదో పెట్టి ఏదో తిప్పాలనుకుంటున్నావ్ ఏంటీ? నాకు కేసీఆర్ కు లక్ష ఉంటాయి. అన్నీ చెప్పాలా మేం ఏం చేసుకుంటే మీకెందుకు?" అంటూ ఆమెపై సీరియసర్ అయ్యారు బాబు మోహన్.


Click it and Unblock the Notifications











