సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించండి.. మరణం వెనుక మాఫియా.. ప్రధాని మోదీకి ఎంపీ లేఖ

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన మృతి కేసును సిబీఐకి అప్పగించాలనే డిమాండ్ ఇటీవల కాలంలో తీవ్రతరం అవుతున్నది. నెటిజన్లే కాకుండా పలువురు రాజకీయ, సీనీ ప్రముఖులే కాకుండా బీజేపీ ఎంపీలు కూడా డిమాండ్ చేయడం ఈ కేసు దర్యాప్తు వ్యవహారం సీరియస్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి లేఖ రాయడం మరింత చర్చనీయాంశమైంది. లేఖ గురించి వివారాల్లోకి వెళితే..

హత్యే అంటూ కంగన, రూపా గంగూలీ

హత్యే అంటూ కంగన, రూపా గంగూలీ

జూన్ 14వ తేదీన సుశాంత్ సూసైడ్ చేసుకొన్న తర్వాత పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, సీనియర్ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ లాంటి ప్రముఖులు వీడియోలతోపాటు పలు ఫోటోలను సాక్ష్యాలుగా చూపిస్తూ సుశాంత్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా సినీ ప్రముఖుడు శేఖర్ సుమన్ కూడా సీబీఐ దర్యాప్తుకు ఆన్‌లైన్ ఉద్యమం ప్రారంభించారు.

 అమిత్ షాకు బీహార్ నేత లేఖ

అమిత్ షాకు బీహార్ నేత లేఖ

రెండు రోజుల క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసును విచారణను సీబీఐకి అప్పగించాలని హోంమంత్రి అమిత్ షాకు బీహార్‌కు చెందిన రాజకీయ వేత్త పప్పుయాదవ్ లేఖ రాశారు. పప్పు యాదవ్ లేఖను పరిగణనలోకి తీసుకొన్న అమిత్ షా.. సీబీఐ విచారణ అంశం తన శాఖ పరిధిలోకి రాదు. అది డీవోపీటీ శాఖ కిందకు వస్తుంది.. కాబట్టి వారికి ఈ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని సిఫారసు చేశానని అమిత్ షా తెలిపారు.

సుశాంత్ మరణంపై ఎంపీ సుబ్రమణ్యస్వామి అనుమానాలు

సుశాంత్ మరణంపై ఎంపీ సుబ్రమణ్యస్వామి అనుమానాలు

ఇక గతవారం రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సూసైడ్ కేసులో అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్న ఎంపీ సుబ్రమణ్యస్వామి తన తరఫున ఇష్కరన్ సింగ్ భండారీని న్యాయవాదిగా నియమించారు. ఈ కేసును సిబీఐకి అప్పగించే విషయంపై పోరాటం చేయడానికి తాను సిద్ధమయ్యాయని, అలాగే సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ ఆస్తులు, విదేశాల్లోని వారి సంపదపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీకి సుబ్రమణ్యస్వామి లేఖ

ప్రధాని మోదీకి సుబ్రమణ్యస్వామి లేఖ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు ముగింపు దశకు చేరుకొన్న నేపథ్యంలో ఎంపీ సుబ్రమణ్యస్వామి సీబీఐ విచారణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి పెంచడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది ఇష్కరన్ సింగ్ ట్వీట్ చేశారు.

సుశాంత్ మరణం వెనుక దుబాయ్ మాఫియా, బాలీవుడ్ ప్రముఖులు

సుశాంత్ మరణం వెనుక దుబాయ్ మాఫియా, బాలీవుడ్ ప్రముఖులు

ప్రధాని మోదీకి రాసిన లేఖలో సుబ్రమణ్యస్వామి పలు ఆరోపణలు చేశారు. నా న్యాయవాది ఇష్కరన్ భండారి చేసిన రీసెర్చ్‌లో పలు షాకింగ్ అంశాలు తెలిసాయి. సుశాంత్ మరణం వెనుక బాలీవుడ్ ప్రముఖులు, దుబాయ్‌లోని ఓ మాఫియా డాన్‌ హస్తం ఉంది. ఇలాంటి విషయాలు బయటకు రావాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే అని తన లేఖలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X