twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్‌బాబు బెదిరింపులకు ప్రభుత్వం హడలింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : మంచు విష్ణు,హన్సిక కాంబినేషన్ లో వచ్చిన దేనికైనా రెడీ చిత్రం వివాదాలతో విజయవంతంగా ముందుకెళ్తోంది. కోర్టులు,టీవీ ఛానెల్స్,ధర్నాలు,యాగాలు,మానవ హక్కుల సంఘాలు అంటూ రోజుకో రకంగా ఈ చిత్రం వార్తల్లో నిలిచి ఎనలేని పబ్లిసిటీ మూటకట్టుకుంది. అయినా ఇంకా ఆ వేడి చల్లారినట్లు లేదు. ఇంకా ఈ చిత్రం విషయమై ధర్నాలు,రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి.

    హిందు ఆత్మరక్షణ సమితి ఈ చిత్రం విషయమై ఆదివారం హైదరాబాద్ ధర్నాచౌక్‌లో రిలే నిరాహార దీక్ష నిర్వహించింది.దేనికైనారెడీ చిత్రంపైన ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టడం దారుణమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ హీరో మోహన్‌బాబు బెదిరింపులకు రాష్ట్ర ప్రభుత్వం హడలిపోవడం సబబు కాదన్నారు. భాజపా నాయకులు జి.హనుమంతరావు, గోవింద్‌రాఠీ తదితరులు పాల్గొన్నారు. మేకల శ్రీనివాస్‌యాదవ్‌, పవన్‌లు రిలేదీక్షచేసిన వారిలో ఉన్నారు.

    మరో ప్రక్క 'దేనికైనా రెడీ' సినిమాలో పేర్ల ప్రదర్శన సమయంలో నటులు మోహన్ బాబు, బ్రహ్మానందం 'పద్మశ్రీ' అవార్డుకు ఉపయోగించుకున్నారని, ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని బీజేపీ నేత ఇంద్ర సేనారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. వారికి ఇచ్చిన 'పద్మశ్రీ' అవార్డులను వెనక్కి తీసుకోవాలని కూడా ఆయ తన పిటీషన్లో కోరారు. అదే విధంగా ఒక సామాజిక వర్గం మనో భావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న 'దేనికైనా రెడీ' చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని ఇంద్రసేనారెడ్డి తన పిటీషన్లో కోరారు. ఇప్పటికే 'దేనికైనా రెడీ' చిత్రంపై పలు కేసులు నమోదడంతో పాటు, కోర్టుల్లో పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

    మంచు విష్ణు-హన్సిక నటించిన 'దేనికైనా రెడీ' చిత్రం కొద్ది రోజుల క్రితం ఆ చిత్ర నిర్మాత మోహన్ బాబుతో పాటు మరో ఏడుగురిపై వరంగల్ జిల్లా జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేనికైనా రెడీ చిత్రం బ్రాహ్మణుల కించ పరిచే విధంగా ఉందని బ్రాహ్మణ సమాజం సేవా సంస్థ సహాయ కార్యదర్శి వారణాసి పవన్ కుమార్ జనగామ కోర్టులో పిటీషన్ వేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ జరుపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు చిత్ర నిర్మాత మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, నడుడు బ్రహ్మానందం, దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి, సెన్సార్ బోర్డు ఆఫీసర్ ఎ. ధనలక్ష్మి, రచయిత కోన వెంకట్ మరియు వెంకట సుబ్రహ్మణ్యం, బి. రవిలపై కేసులు నమోదయ్యాయి.

    English summary
    BJP has demanded arrest of Mohan Babu and others. Party leader Prabhakar Rao said though the court has directed the police to register cases and arrest the accused, the government was trying to save Mohan Babu and others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X