For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ అంటే వైఎస్ జగన్‌కు భయం.. ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వేళ్లే సీఎంకు వకీల్‌సాబ్‌ను చూస్తే దడ..

    |

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వకీల్ సాబ్ మూవీ మరింత వేడెక్కిస్తాయా అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇంచార్జి సునీల్ దియోధర్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను చూస్తే వైఎస్ జగన్‌కు భయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీల్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసిన వీడియో ప్రకారం..

    బెయిల్ క్యాన్సిల్ అంటూ సంచలనం

    బెయిల్ క్యాన్సిల్ అంటూ సంచలనం

    తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ ఆయన బెయిల్ ఏ క్షణంలోనైనా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని కామెంట్ చేసి రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించారు. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందని పేర్కొన్నారు.

    ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు

    ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు

    ఇక వకీల్ సాబ్ సినిమా రిలీజ్ రోజున మరో సంచలన వీడియోను ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకొనే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్‌ను చూసి భయపడేది అంటూ సునీల్ దియోధర్ కామెంట్ చేశారు. దాంతోపాటు వీడియోను కూడా షేర్ చేశారు.

    వకీల్ సాబ్ సినిమా చూడటానికి వచ్చా

    వకీల్ సాబ్ సినిమా చూడటానికి వచ్చా

    సునీల్ దియేధర్ వీడియోలో పేర్కొన్న ప్రకారం.. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను చూడటానికి వచ్చాను. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ తీరు చాలా బాధను కలిగించింది. పవన్ కల్యాణ్‌ అంటే ఆయనకు విపరీతమైన భయం ఉన్నట్టు స్పష్టమైంది అని సునీల్ కామెంట్ చేశారు.

    వైఎస్ జగన్‌కు సూటి ప్రశ్న

    వైఎస్ జగన్‌కు సూటి ప్రశ్న

    ఏపీలో వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలను రద్దు చేశాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నాను. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్‌ను చూసి భయపడితే.. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలపై పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ కాంబినేషన్‌లో వచ్చే బీజేపీ, జనసేన సినిమా రాష్ట్రమంతటా రిలీజయితే మీ పరిస్థితి ఏమిటని సునీల్ ప్రశ్నించారు.

     అవినీతి, మత మార్పిడులను ప్రశ్నిస్తాం

    అవినీతి, మత మార్పిడులను ప్రశ్నిస్తాం

    త్వరలోనే ఏపీలో మీ పాలనకు వ్యతిరేకంగా, అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా, మీ రౌడీ పాలనకు, అవినీతి కుటుంబానికి వ్యతిరేకంగా, మత మార్పిడులకు వ్యతిరేకంగా, మాత మార్పిడులకు ఆర్థిక సహాయం చేయడంపై ప్రశ్నించే సమయం రానున్నది. ఇప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం సరైన సమయం కాదు అని సునీల్ దియేధర్ అన్నారు.

    South నుండి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన లెజెండ్స్ వీరే !

    వకీల్ సాబ్ సూపర్ హిట్

    తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక్కటే విన్నపం. వకీల్ సాబ్ సినిమాను ప్రతీ ఒక్కరు చూడాలని కోరుతున్నాను. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గారు నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఒక్కటే చెప్పాను. వకీల్ సాబ్ రిలీజైంది. ఈ సినిమా విజయం సాధించినట్టే.. మీ గెలుపు కూడా ఖాయమైంది అంటూ సునీల్ దియేధర్ పేర్కొన్నారు.

    English summary
    Sunil Deodhar sensational Comments on YS Jaganmohan Reddy amid Pawal Kalyan's Vakeel Saab Release. He released a video and said that, Soon BJP, Jana Sena will question the AP CM's Rowdy rule, Barbaric rule and Religious conversions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X