Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ పై బీజేపీ ఫైర్.. బికినీలతో దేవుడి పాట ఏంటని ఆగ్రహం!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఆయన మ్యూజిక్ తో ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తారు. దేవి ఒక సినిమాకు మ్యూజిక్ చేస్తే మినిమం హిట్ అన్న పేరు ఉంది. ఎప్పటికప్పుడు కొత్త పంథాలో మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. యంగ్ అండ్ ఓల్డ్ జనరేషన్ వరకు దేవీ సంగీతం అంటే ఇష్టపడని వారుండరు. ఇటీవల అల్లు అర్జున్, రష్మిక మందన్నా జోడిగా నటించిన పుష్ప సినిమాతో మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ గా తానేంటో నిరూపించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్. అయితే ఎప్పుడు కొత్త తరహాలో మ్యూజిక్ కంపోజ్ చేయాలనే దేవి శ్రీ ప్రసాద్ తపనే ఆయనకు చిక్కులు తీసుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళితే..

అపహాస్యం చేస్తూ అసభ్యంగా..
నిత్యం తన మ్యూజిక్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. డీఎస్పీపై భారతీయ జనతా పార్టీ చాలా ఆగ్రహంగా ఉంది. దేవి శ్రీ తాజాగా కంపోజ్ చేసిన ఓ పాట కర్ణ కఠోరంగా ఉందని.. వెంటనే ఆ పాటను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. డీఎస్పీ తాజాగా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఓ సాంగ్ లిరిక్స్ లో హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే దేవుడి పాటను పేరడి చేసి అపహాస్యం చేస్తూ అసభ్యంగా చిత్రీకరించాని ఆరోపించారు.

బికినీలపై డ్యాన్స్ చేస్తూ..
కోట్లాది మంది జపించే హరే రామ.. హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సాంగ్ షూట్ చేశారని బీజేపీ జాతీయ బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పార్థ సారథి ఆరోపించారు. దేవి శ్రీ కంపోజ్ చేసిన ఈ పాటపై ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఆ పాటను డిలీట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
బహిరంగంగా క్షమాపణ..
ఈ ట్వీట్ లో ''ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జపించే హరే రామ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్ కి పాడుతూ.. బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తక్షణమే ఆ పాటను అన్ని ప్రసార మాధ్యామాల నుంచి తీసివేయాలి'' అని రాసుకొచ్చారు సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పార్థ సారథి.

దేవి అనుగ్రహంతో దేవి శ్రీ ప్రసాద్ గా..
అలాగే దేవి శ్రీ ప్రసాద్ పై పలు హిందూ సంఘాలు కూడా ధ్వజమెత్తాయి. వట్టి శ్రీ ప్రసాద్.. దేవి సినిమాతో.. ఆ దేవి అనుగ్రహంతో దేవి శ్రీ ప్రసాద్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పేరు ప్రఖ్యాతలు పొందుతూ దైవాలనే అపహాస్యం చేస్తున్నారని.. ఏరు దాటి తెప్ప.. సామెత ఆయనకు సరిపోతుందని అంటున్నారు. అయితే తాజాగా దేవి శ్రీ ప్రసాద్ పాడిన ఈ పాట సినిమాలోనిది కాదు.

ఓ పిల్ల అని పేరుతో..
ఇటీవల దేవి శ్రీ ప్రసాద్ జాతియా స్థాయిలో పాటలు కంపోజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ అయిన టీ సిరీస్ కోసం దేవి ఈ పాటను రూపొందించారు. ఓ పిల్ల అని పేరుతో ఉన్న ఈ పాటను మూడు వారాల కిందట యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కూడా డ్యాన్స్ చేసిన ఈ పాటకు 2 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అయితే హిందీలో ఉన్న ఈ పాటలో అభ్యంతరక పదాలున్నాయని బీజేపీ, హిందూ సంఘాలు అభ్యంతరం వక్తం చేస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ మూవీ కన్నా ముందే..
కాగా ఇటీవల అల్లు అర్జున్-సుకుమార్ కాంబో మూవీ పుష్పతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు డీఎస్పీ. ఈ మూవీ పాన్ ఇండియాగా విడుదలయ్యాక.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కబీ ఈద్ కబీ దివాలి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నాడు. దీనికంటే ముందే టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ వీడియో సాంగ్ కు ఆఫర్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











