twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జార్జిరెడ్డిపై భగ్గుమన్న ఎమ్మెల్యే రాజాసింగ్...వాస్తవాలు చూపించకపోతే దారుణంగా రియాక్షన్

    |

    ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'జార్జ్ రెడ్డి'. ఈమధ్యే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జార్జ్ రెడ్డి 25 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. హైదరాబాద్ చేగువేరాగా ప్రసిద్ది చెందిన ఆయన జీవితగాథ వెండితెరపై ఆవిష్కరిచంనున్నారు. అయితే విడుదల దగ్గర పడుతున్న కొద్దీ.. ఈ చిత్రానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ నాయకులు, ఏబీవీపీ సంఘాలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.

    అంచనాలు పెంచేసిన ట్రైలర్..

    ఈ మూవీ వస్తుందని మొదట పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ ట్రైలర్ రిలీజైన క్షణం నుంచి ఈ మూవీ అందరి నోళ్లలో నానుతూ వస్తోంది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, తెరకెక్కించిన విధానం, అప్పటి వాతావరణం ఇలా ప్రతీ ఒక్కటి సినిమాపై నమ్మకాన్ని పెంచడంతో జార్జి రెడ్డి తెగ వైరల్ అయింది.

    మెగా బ్రదర్ ఎంట్రీతో..

    మెగా బ్రదర్ ఎంట్రీతో..

    ఈ మూవీపై మెగా బ్రదర్ నాగబాబు కామెంట్ చేయడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. అసలు బయోపిక్ అంటే ఇది.. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి సినిమాలు తీయాలని, ఆయన గురించి చదువుకునే రోజుల్లో వినేవాడిని అంటూ జార్జి రెడ్డి గురించి చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్‌తో తీయాలని అనుకున్నట్లు కూడా చెప్పాడు. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ ఆకాశానికెత్తేశాడు.

    తాజాగా చిరును కలిసిన చిత్రయూనిట్..

    తాజాగా చిరును కలిసిన చిత్రయూనిట్..

    ఈ మూవీ నుంచి ఓ పాటను విడుదల చేయాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవిని చిత్రబృందం కోరింది. ఈ మేరకు చిత్ర యూనిట్ చిరంజీవి ఇంటికి కూడా చేరుకుంది. వారందరితో సినిమా గురించి ముచ్చటిస్తూ.. ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాడు. ఇలా మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఈ చిత్రం జనాల్లోకి బాగా రీచవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు రాజకీయ రంగు అంటుకుంది.

    ఏబీవీపీ, పీడీఎస్‌యూ మధ్య పోరు..

    ఏబీవీపీ, పీడీఎస్‌యూ మధ్య పోరు..

    జార్జి రెడ్డి పీడీఎస్‌యూకు సంబంధించిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో తమను కావాలనే విలన్లుగా చూపిస్తున్నారని ఏబీవీపీ నాయకులు కొందరు ఫైర్ అవుతున్నారు. దీంతో ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకున్నట్టైంది. దీంట్లోకి రాజకీయ నాయకులు ఎంటర్ అవ్వడంతో మరింత రచ్చగా మారింది.

    జార్జి రెడ్డి రాజాసింగ్ ఫైర్..

    జార్జి రెడ్డి రాజాసింగ్ ఫైర్..

    తాజాగా ట్రైలర్‌ను చూశాను.. ఈ సినిమాలో ఏకపక్షంగానే చూపిస్తున్నారు..వారు వాస్తవం ఏంటన్నది తెలుసుకోవాలని సూచించారు.. ఆయన ఒక హీరో అన్నట్లు.. అంతా అబద్దాలు చూపిస్తున్నారని మండిపడ్డారు.. జార్జి రెడ్డిని ఏబీవీపీ నాయకులు హత్య చేసినట్లు చూపిస్తున్నారు.. వాస్తవాలు చూపించకపోతే మా రియాక్షన్ కూడా ఉంటదని హెచ్చరించారు. 1972లోనే ఆయన హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీపై దాడులు జరిగియాయని మేము కూడా విన్నామని తెలిపారు. వాస్తవం ఏంటన్నది బయటకు రావాలి.. .. మీరు నిజం చూపిస్తే మాకేం అభ్యంతరం లేదని తెలిపారు.

    Recommended Video

    #CineBox : Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming Film !
    డబ్బుల కోసమే..

    డబ్బుల కోసమే..

    నిర్మాతలు, దర్శకులు డబ్బులు సంపాదించడం కోసమే ఇలాంటి చిత్రాలను తెరకెక్కిస్తారని రాజా సింగ్ ఫైర్ అయ్యారు. ఓ వర్గాన్ని తక్కువ చూపడం, ఇంకో వర్గానికి సంబంధించిన వ్యక్తిని హీరోగా చూపిస్తూ సినిమాలు తీయడం, అందరూ కలిసి ఉంటే మధ్యలో విబేధాలు సృష్టించేలా సినిమాలు తీసి డబ్బులు సంపాదించాలని చూస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ, బీజేపీ, సంఘ్‌లకు వ్యతిరేకంగా సినిమాలు తీయడం అలవాటైపోయిందని ఘాటుగా విమర్శించారు.

    English summary
    Bjp Mla Raja Singh Fires On George Reddy Movie. He Claimed That They Are Showing Only One Side. He Wants That Makers Must Tell The Truth. Sandeep Madhav Acts As George Reddy, This Movie Is directed By Jeevan reddy. George reddy Movie Is Releasing On 22nd November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X