బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ...ఓ సైకో!
Recommended Video

నిర్మాత,తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరి సాయి వెంకట్ మాట్లాడుతూ ఏంపీ చింతామణి మాలవీయ ''పద్మావతి'' సినిమా విషయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఓ బాధ్యత గల పదవిలో ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో ఉండి ఇలా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం చాలా తప్పు.
సినిమా గురించి మాట్లాడేటప్పుడు సినిమా గురించే మాట్లాడాలి కానీ సినీ పరిశ్రమ మొత్తాన్ని తిట్టడం ఏంటో అర్ధం కావట్లేదు ఇతని మాటలు ఫేస్బుక్ లో కూడా వున్నాయి. అతని వీడియోస్ కూడా మా దగ్గర వున్నాయి.
ఇతని మాటలు వింటుంటే 'సైకో' లా కనిపిస్తున్నాడు. ఆడవాళ్ళకు గౌరవమివ్వకుండా కొంచెం కూడా బాధ్యతలేకుండా మాట్లాడుతున్నాడు ఇతడు ఒక 'టెర్రరిస్ట్'.. ఇలాంటి వాణ్ణి ఊరికే వదిలి పెట్టె పరిస్థితి లేదు అన్నారు.
ఎంపీ వ్యాఖ్యలను అమిత్ షా, 'మోదీ' దృష్టికి తీసుకెళ్తాం. ఈ విషయమై ఏం.పి.చింతామణి మాల్య బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి లేదంటే డిల్లీలో నిరాహార దీక్షలు చేస్తాం ఇలాంటి వాడు వెంటనే రాజీనామా చెయ్యాలి లేదంటే ఈ విషయాన్నీ నేషనల్ మీడియాలో పెడతాం అని ధ్వజమెత్తారు.


Click it and Unblock the Notifications











