For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Adipurush: ప్రభాస్ 'ఆదిపురుష్' పై బీజేపీ ఫైర్.. రావణుడి గురించి తెలుసా?.. సీనియర్ NTR గురించి విన్నారా?

  |

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. రామాయణ గాథతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్ని విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఈ టీజర్ ను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో సహా ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. ఒకవైపు నెటిజన్లు ట్రోలింగ్ లతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఆదిపురుష్ హిందీ టీజర్ మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టీజర్ పై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రామాయణం గురించి తెలుసా అంటూ మండిపడ్డారు.

  షాక్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్..

  షాక్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్..

  రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఊహలకు అందనివిధంగానూ టీజర్ ను చాలా నిరాశపరిచే విధంగా డిజైన్ చేసినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ పై ప్రభాస్ సీరియస్ అయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

   రామాయణం కథ ఆధారంగా..

  రామాయణం కథ ఆధారంగా..


  ఇదిలా ఉంటే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆదిపురుష్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణం బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తూ ఉండగా సీత పాత్ర కోసం కృతి సనన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ను ఆదివారం రోజు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో సరయు నది ఒడ్డున విడుదల చేశారు.

  నిజంగానే రూ. రూ. 500 కోట్లు ఖర్చుపెట్టారా..

  నిజంగానే రూ. రూ. 500 కోట్లు ఖర్చుపెట్టారా..

  ఈ టీజర్ చూసిన ప్రేక్షకుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సినిమా కోసం నిజంగానే రూ. 500 కోట్లు ఖర్చుపెట్టారా అనేక రకాలు ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టీజర్ పై బీజేపా అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ తీవ్రంగా మండిపడ్డారు.

   రావణాసురిడి పాత్ర పరిశీలించాల్సింది..

  రావణాసురిడి పాత్ర పరిశీలించాల్సింది..

  ఆదిపురుష్ టీజర్ (Adipurush Teaser) గురించి మాట్లాడుతూ ''ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది. వాల్మికీ రామాయణం, తులసీదాసు రామాయణంలో రావణుడి పాత్ర ఎలా ఉంటుందో డైరెక్టర్ ఓం రౌత్ సరిగ్గా అధ్యయనం చేయలేదనుకుంటాను. కనీసం తెలుగు, తమిళంలో ఇదివరకు తెరకెక్కిన పౌరాణిక సినిమాల్లోని రావణాసురిడి పాత్ర ఎలా ఉందో పరిశీలించాల్సింది. భూకైలాస్ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ లేదా సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు చేసిన రావణుడి పాత్రను చూసి అర్థం చేసుకోవచ్చు.

  నీలి కళ్లతో లెదర్ జాకెట్ వేసుకుని..

  నీలి కళ్లతో లెదర్ జాకెట్ వేసుకుని..

  కానీ ఈ టీజర్ లో రావణాసురుడు నీలి కళ్లతో లెదర్ జాకెట్ వేసుకున్నట్లు చూపించారు. స్వేచ్ఛా ముసుగులో చరిత్రను వక్రీకరించకూడదు. రామాయణం మన దేశ ప్రజల నాగరికతను కాపాడుతుంది. అలాంటి రామాయణాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రంలో రావణుడి పాత్రను తప్పుగా చూపించడం చాలా బాధగా ఉంది. లంకకు చెందిన రావణుడు ఒక శివ భక్తుడు, బ్రహ్మాణుడు.

  64 కళలో ప్రావీణ్యం..


  ఆయన 64 కళలో ప్రావీణ్యం సంపాదించాడు. వైకుంఠపాలకులైన జయ విజయల శాపం కారణంగా రావణుడిగా అవతరించాడు. అయితే ఆదిపురుష్ లోని రావణాసురుడు టర్కిష్ నిరంకుశుడిలా ఉన్నాడు. మన రామాయణం, చరిత్రను తప్పుగా చూపించడం ఆపండి. లెజెండ్ ఎన్టీ రామారావు గురించి ఎప్పుడైనా విన్నారా'' అంటూ చెప్పుకొచ్చారు. కాగా మాళవిక అవినాష్ కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ మూవీ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

  English summary
  Prabhas Adipurush Teaser Getting Negative Reactions. BJP Spokesperson Malavika Avinash Fires On Adipurush Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X