twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ 'చేత'బడి

    By Staff
    |

    Ram Gopal Varma
    ఎప్పుడో యండమూరి వీరేంధ్రనాధ్ రాసిన 'తులసీదళం' నవల ఆధారంగా వర్మ ఇప్పుడు 'ఫూంఖ్' అనే సినిమాను రూపొందించి రిలీజ్ చేసారు. చేతబడి అనే మూఢనమ్మకం ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎవరినీ భయపెట్టలేక ధియోటర్ మొత్తం నవ్వులతో నింపుతోందనేది రిపోర్టు. అసలు వర్మకు ఏమైంది. వరస ఫ్లాఫులతో ఎందుకు వర్మ కుదేలవుతున్నారనేది అభిమానులు ఆలోచనలో పడుతున్నారు. కొందరైతై సెటైర్ గా వర్మకు చేతబడి చేసారు అందుకే ఇట్లా జరుగుతోందని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని ఒంటరిగా చూస్తే ఐదు లక్షలు ఇస్తామని నిర్మాతలు ప్రకటన చేసారు. ఐతే ఎందుకనో ఎవరూ సాహసం చేయలేదు.

    అయితే ఎవరన్నా ధైర్యం చేసుంటే వారి ఆస్ధి మొత్తం హారతి కర్పూరంలా ఈ బహుమతి ఎమౌంట్ కే సరిపోయేది...ఎందుకంటే ఒక్కచోట కూడా భయపడలేదని ప్రేక్షకులు అంటున్నారు. అలాగే వర్మ తను నాస్తికుడని అనీ, మూఢనమ్మకాలు,దేముడు వంటివి నమ్మనంటారు. అయితే ఈ సినిమాలో హీరో మొదట వర్మలా బిహేవ్ చేస్తూంటాడు. తర్వాత కూతురు చేతబడికి గురైన చనిపోయే పరిస్ధితుల్లో దేముడున్నాడని నమ్ముతాడు. అంటే వర్మ కూడా ఆస్ధికుడుగా మారాడా...అన్నది అందరి డౌటు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X