twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమైన సినిమా కథ

    By Staff
    |

    Head Of The State
    వాస్తవ సంఘటనలు ఆధారంగా సినిమాలు తీయటం ప్రపంచం అంతా ఉన్నదే. అలాగే అప్పుడప్పుడూ సినిమాల్లో ఊహించిన అంశాలు నిజజీవితంలోనూ చోటు చేసుకుని షాక్ ఇస్తూంటాయి. తాజాగా అమెరికా అధ్యక్ష పదవిని ఒక నల్ల జాతీయుడు చేపట్టడం అనే భావన నిన్నటి వరకూ సినిమాలకే పరిమితమితం. ఇవాళ ఒబామా ప్రమాణస్వీకారంతో వాస్తవ రూపం దాల్చింది. ఒక నల్ల జాతీయుడు శ్వేత సౌధాధీశుడవడాన్ని హాలీవుడ్‌ దర్శకులు కొన్ని చిత్రాల్లో చూపించటాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

    1972లో వచ్చిన 'ద మేన్‌' అనే చిత్రంలో అమెరికా అధ్యక్షుడిగా నల్లజాతీయుణ్ని చూపారు. ఈ సినిమాలో ఒక భవనం కుప్పకూలడంతో అధ్యక్షుడు, స్పీకర్‌ మరణిస్తారు. అప్పుడు అనారోగ్యం కారణంగా ఉపాధ్యక్షుడు పదవిని చేపట్టేందుకు నిరాకరిస్తారు. దీంతో సెనేట్‌ అధ్యక్షుడు, నల్లజాతీయుడైన డగ్లస్‌ దిల్మన్‌ (నటుడు జేమ్స్‌ ఎర్ల్‌ జోన్స్‌ ఈ పాత్ర పోషించారు) అకస్మాత్తుగా అధ్యక్ష బాధ్యతలు చేపడతారు.

    ఇక 1998లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్ చిత్రం 'డీప్‌ ఇంపాక్ట్‌'లోనూ అమెరికాకు టామ్‌ బెక్‌ (మోర్గాన్‌ ఫ్రీమన్‌ ఈ పాత్ర పోషించారు.) అనే నల్లజాతి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సినిమాలో వుల్ఫ్‌- బీడర్‌మన్‌ అనే తోకచుక్క భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తూ ఉంటుంది. దీంతో 'అధ్యక్షుడు టామ్‌ బెక్‌'రష్యాతో కలసి ఒక వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపుతారు. ఈ నౌక అణ్వస్త్రాలను ప్రయోగించి తోకచుక్కను నాశనం చేస్తుంది.

    అలాగే 2003లో వచ్చిన 'హెడ్‌ ఆఫ్‌ ద స్టేట్‌' అనే హాస్య చిత్రంలో మేస్‌ గిలియం అనూహ్య పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలను చేపడతారు. ఎన్నికల్లో పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు విమాన ప్రమాదంలో చనిపోతారు. దీంతో ఎన్నికల్లో ఎటూ ఓడిపోతామని భావించి, పార్టీ.. ఒక మైనార్టీని బరిలోకి దించుతుంది. చివరకూ అనూహ్యంగా ఆయన విజయం సాధిస్తారు.ఈ సినిమాలన్నిటికీ ఇప్పడు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. ఈ సినిమాలు రూపొందించటానికి కథ అందించిన రచయితలు ఊహ నిజమవటం గొప్పగా పొగుడుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X