మెగా అభిమానులను దోచుకుంటున్న వైనం...

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో జోరుగా బ్లాక్ టికెటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రధాన థియేటర్లతో పాటు మరికొన్ని చోట్ల టికెట్లను బ్లాక్ చేసి రూ. 55 విలువ చేసే టిక్కెట్ లను రూ.500 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని థియేటర్ల వద్ద థియేటర్ సిబ్బందే బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ల అవాతారం ఎత్తి అభిమానులు దోచుకుంటున్నారు.

పోలీసులు, అధికారులకు ఈ విషయం తెలిసినా....చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటం బ్లాక్ టికెటంగ్ అమ్మేవాళ్లకు వరంగా మారింది. ఫ్రీ టిక్కెట్లకు ఆశ పడి వాళ్లు చర్యలు తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది.

బిజీ బిజీగా సాగే హడావుడి నగర జీవితంలో థియేటర్ వరకు వచ్చిన తర్వాత టిక్కెట్ దొరకని నేపథ్యంలో వెనక్కి తిరిగి పోవడం ఇష్టం లేక తమ అభిమాన హీరో సినిమా చూడటానికి కొందరు అభిమానులు తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్‌లో భారీగా మొత్తం చెల్లించి తమ చేతి చమురు వదిలించుకుంటున్నారు.

రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి సమర్పకులు కాగా, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X