»   » సల్మాన్ మీద రూ. 1000 కోట్ల పెట్టుబడులు: బెయిల్ రాకుంటే ఆ సినిమాలన్నీ ఢాం...

సల్మాన్ మీద రూ. 1000 కోట్ల పెట్టుబడులు: బెయిల్ రాకుంటే ఆ సినిమాలన్నీ ఢాం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలాడు. ఈ కేసులో గరిష్టంగా 7 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. అయితే సల్మాన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని శిక్ష కాలం రెండేళ్లకు తగ్గించాలని సల్మాన్ తరుపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ కనీసం రెండేళ్లు జైలుకెళ్లడం ఖాయం అని తేలిపోయింది.

సల్మాన్ మీద రూ. 1000 కోట్ల బడులు

సల్మాన్ మీద రూ. 1000 కోట్ల బడులు

సల్మాన్ ఖాన్‌ దోషిగా తేలడంతో ఆయనతో సినిమాలు ప్లాన్ చేసుకున్న నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. ఆయన్ను నమ్ముకుని దాదాపు రూ. 1000 కోట్ల విలువ చేసే సినిమా ప్రాజెక్టుల్లో పలువురు నిర్మాతలు పెట్టుబడి పెట్టారు. ఆయనకు శిక్ష ఖరారైన తర్వాత బెయిల్ దొరక్క పోతే ఏంటి పరిస్థితి అనే ఆందోళన నిర్మాతల్లో నెలకొని ఉంది.

ప్రస్తుతం రేస్ 3

ప్రస్తుతం రేస్ 3

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మల్టిపుల్ మెగా బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్ 3' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈద్ సందర్భంగా జూన్ 15న ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉంది. ఈ మూవీ రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సల్మాన్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన గత చిత్రాల వసూళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనీసం రూ. 200 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. బెయిల్ దొరకకకుండా సల్మాన్ జైలుకు పరిమితం అయితే ఈ సినిమా రిలీజ్ ఆయోమయంలో పడనుంది.

 రూ. 200 కోట్లతో ‘భరత్'

రూ. 200 కోట్లతో ‘భరత్'

రేస్ 3 తర్వాత సల్మాన్ ఖాన్ ‘భరత్' అనే మరో సినిమాకు కమిట్ అయ్యాడు. సల్మాన్ ఖాన్‌తో సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి చిత్రాలు తీసిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సల్మాన్ ఖాన్ కెరీర్లో మరో భారీ బడ్జెట్ చిత్రంగా ‘భరత్' ప్లాన్ చేస్తున్నారు. ‘రేస్ 3' విడుదల తర్వాత ‘భరత్' షూటింగ్ మొదలు పెట్టి 2019 ఈద్ నాటికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ‘భరత్' ప్లాన్ చేశారు. సల్మాన్ జైలుకు పరిమితం అయితే ఈ సినిమా ఆగిపోయే అవకాశం ఉంది.

దబాంగ్ 3, కిక్ 2

దబాంగ్ 3, కిక్ 2

దీంతో పాటు సల్మాన్ ఖాన్ కమిట్మెంట్లలో ‘దబాంగ్ 3, ‘కిక్ 2' చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు స్క్రిప్టు దశలో ఉన్నాయి. ఈ చిత్రాలు 2019 ద్వితీయార్థంలో సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేశారు. ఈ రెండు చిత్రాలకు కలిసి బడ్జెట్ కనీసం రూ. 300 కోట్లు ఉంటుందని అంచనా. సల్మాన్ ఖాన్‌ జైలుకు పరిమితం అయితే ఈ ప్రాజెక్టుల పరిస్థితి అగమయ్యగోచరంగా మారనుంది.

సొంత బేనర్లో లవ్ రాత్రి

సొంత బేనర్లో లవ్ రాత్రి

దీంతో పాటు సల్మాన్ ఖాన్ తన సొంత బేనర్లో ‘లవ్ రాత్రి' అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తన చెల్లిలి భర్త ఆయుష్ శర్మను హీరోగా లాంచ్ చేయాలనేది ప్లాన్. ఈ సినిమా ద్వారా వరీనా హుస్సేన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. లవ్ రాత్రి మూవీ ఎస్టిమేటెడ్ బడ్జెట్ రూ. 150 కోట్లు..... దీనికి సల్మాన్ నిర్మాత కాబట్టి ఏమవుతుందో చూడాలి.

సినిమాలు మాత్రమే కాదు టీవీ షోలు

సినిమాలు మాత్రమే కాదు టీవీ షోలు

కేవలం సినిమాలు మాత్రమే కాదు... సల్మాన్ ఖాన్ పలు టీవీ షోలు కూడా హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన హోస్ట్ చేస్తున్న సూపర్ హిట్ బిగ్ బాస్ ఇటీవలే 11వ సీజన్ పూర్తి చేసుకుంది. త్వరలో 12వ సీజన్ మొదలు కావాల్సి ఉంది. దీంతో పాటు ‘దస్ కా దమ్' అనే కార్యక్రమాన్ని మళ్లీ మొదలు పెడుతున్నారు. సోనీ టీవీలో ప్రసారం కానున్న ఈ షో కోసం సల్మాన్ ఖాన్ మీద ఓ ప్రోమో కూడా చిత్రీకరించారు. సల్మాన్ ఈ టీవీ షో కోసం 20 ఎపిసోడ్లకు గాను రూ. 78 కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకునేలా అగ్రిమెంటు కూడా జరిగింది..... సల్మాన్ జైలుకెళితే ఈ కార్యక్రమాలు ఆగిపోయే అవకాశం ఉంది.

ఎండార్స్మెంట్ల ద్వారా కోట్ల ఆదాయం

ఎండార్స్మెంట్ల ద్వారా కోట్ల ఆదాయం

సినిమాలు, టీవీ షోలతో పాటు ఇమామి గ్రూఫుకు చెందిన ఇడిబుల్ ఆయిల్, థమ్స్ అప్, రివైటల్, యాత్ర డాట్ కామ్, స్ల్పాష్, రిలాక్సో లాంటి బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. వాటి ద్వారా సల్మాన్ ఖాన్ కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్నారు.... సల్మాన్ జైలు కెళితే ఈ ఆదాయానికి గండిపడనుంది.

English summary
The Jodhpur sessions court Thursday (April 5) convicted the Salman Khan in the 1998 blackbuck poaching case and awarded a two-year jail term. If the actor fails to get a bail, the price is heavy as projects worth more than Rs 1,000 crore are in the line-up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X