twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణజింక వేట కేసు,హాజరుకాని సల్మాన్‌

    By Srikanya
    |

    జోధ్‌పూర్‌: రాజస్థాన్‌లో కృష్ణజింకను వేటాడిన కేసులో సోమవారం స్థానిక కోర్టులో జరిగిన విచారణకు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, మరో ముగ్గురు నటులు హాజరుకాలేదు. సినీ చిత్రీకరణలో తీరికలేకుండా ఉన్నందున సల్మాన్‌ కోర్టుకు హాజరుకాలేకపోయినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ మేరకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఓ దరఖాస్తు సమర్పించారు. దీంతో న్యాయమూర్తి విచారణను మార్చి 23కు వాయిదా వేశారు.

    జోధ్‌పూర్‌లోని కంకణి గ్రామంలో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌తో పాటు సైఫ్‌అలీఖాన్‌, టబు, సోనాలీబింద్రే మరో ముగ్గురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో జోథ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు సల్మాన్‌ ఖాన్‌ను దోషిగా నిర్ధారించింది. వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కింద సల్మాన్‌పై 1997లో కేసు నమోదైంది. రాజస్థాన్‌ అడవుల్లో కృష్ణజింకలను వేటాడనే ఆరోపణపై సల్మాన్‌పై కేసు నమోదయింది. సల్మాన్‌ఖాన్‌కు జోథ్‌పూర్‌ కోర్టు అప్పట్లో ఏడాది జైలు శిక్ష విధించింది.

    సల్మాన్‌ ఖాన్‌కు సహకరించిన వాచ్‌మన్‌ గోవింద సింగ్‌కు ఏడాది జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. ఫామ్‌ హౌస్‌ వాచ్‌మన్‌ గోవిందసింగ్‌ను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో మరో నలుగురు నిందితులను జ్యుడిష్యల్‌ మెజిస్ట్రేట్‌ బ్రిజేంద్ర కుమార్‌ సింగ్‌ నిర్దోషులుగా విడుదల చేసింది. సల్మాన్‌ఖాన్‌కు విధించే శిక్షను కోర్టు ఖరారు చేయాల్సి వుంది.

    జోథ్‌పూర్‌లోని ఫామ్‌హౌస్‌లో 1988లో సల్మాన్‌ ఖాన్‌ కృష్ణ జింకలను వేటాడడానే ఆరోపణపై కేసు నమోదైంది. కృష్ణ జింకల వేట కేసులో దులానీ ప్రధాన సాక్షి అని భావిస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ జింకలను చంపుతుండగా చూశానని చెప్పిన దులానీ తర్వాత మాట మార్చినట్లు భావిస్తున్నారు. ఒక టీవీ న్యూస్‌ ఛానల్‌లో దులానీ ప్రకటన చేసిన నేపథ్యంలో దులానీ నుంచి వాంగ్మూలం తీసుకోవాలని కోరుతూ అప్పట్లో సల్మాన్‌ న్యాయవాది కోర్టులు పిటిషన్‌ పెట్టుకున్నారు.

    English summary
    Bollywood star Salman Khan and three other actors did not appear before a court here in connection with the 1998 blackbuck poaching case in Rajasthan. Salman's counsel Hastimal Saraswat said the actor could not appear before the court due to his pre-scheduled shooting plans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X