twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లాక్‌మెయిల్‌ కేసు : తెలుగు టీవీ యాంకర్ అరెస్ట్

    By Srikanya
    |

    ఏలూరు : మీడియాలోని మరో చీకటి కోణం వెలుగు చూసింది. బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డ యాంకర్ ని పోలీస్ లు అరెస్టు చేసారు. డెంటల్‌ కళాశాల కరస్పాడెంట్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి కోట్లాది రూపాయలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణపై ఓ ప్రముఖ చానల్‌లో క్రైం న్యూస్‌ యాంకర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్‌ని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు సమీపంలోని సెయింట్‌ జోసఫ్‌ డెంటల్‌ కళాశాల కరస్పాండెంట్‌ రెవరెండ్‌ ఫాదర్‌ పి.బాలను ఓ క్లిప్పింగ్‌ ఆధారంగా హర్షవర్ధన్‌ తరచూ ఫోన్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసేవారు. రూ.5కోట్లు ఇవ్వాలని లేకుంటే పరువు బజారుకీడుస్తానంటూ బెదిరించేవారు. దీంతో ఫాదర్‌ బాల పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రఘురామ్‌రెడ్డికి హర్షవర్ధన్‌పై ఫిర్యాదు చేశారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే...

    Blackmailing : Tv-Anchor Harshvardhan Arrest

    ఛానెల్‌ యాంకర్‌ హర్షవర్ధన్‌ను విజయవాడ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు లోని మెడికల్‌ కళాశాల కరస్పాండెంట్‌ అయిన ఫాదర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసిన హర్షవర్ధన్‌ అక్కడి నుంచి కారులో పరారవుతున్నారన్న సమాచారం మేరకు విజయవాడ పోలీసులు ఐదవ నెంబర్‌ జాతీయ రహదారిపై హర్షవర్ధన్‌ను అదుపు లోకి తీసుకుని కారు స్వాధీనం చేసుకున్నారు. ఐదవ నెంబర్‌ జాతీయ రహదారిపై రామవరప్పాడు సమీపంలో పటమట పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పటమట పోలీసు స్టేషన్‌కు తరలించారు. కారులో భారీ మొత్తంలో నగదుని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ధృవీకరించేందుకు వారు నిరాకరిస్తున్నారు. హర్షవర్ధన్‌తో ఉన్న ఒక యువకుడిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    హర్షవర్ధన్‌ పరారీ సమాచారం తెలిశాక ఏలూరు పోలీసులు అప్రమత్తం అయ్యాక పటమట పోలీసులకు హర్షవర్ధన్‌ పట్టుబడ్డాడు. అక్కడి మెడికల్‌ కళాశాల కరస్పాండెంట్‌ ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు స్పందించారని తెలిసింది. శనివారం రాత్రి పొద్దుపోయాక ఏలూరు పోలీసులు హర్షవర్ధన్‌ను తీసుకుని ఏలూరు బయలు దేరి వెళ్లారు.

    ఎస్పీ ఆదేశాల మేరకు ఏలూరు త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో క్రైం నంబర్‌ 276గా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శనివారం ఫాదర్‌ బాల నుంచి భారీ మొత్తంలో సొమ్ము తీసుకుని విజయవాడ వైపు బయలుదేరిన హర్షవర్ధన్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వలపన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల సమాచారం మేరకు విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడు వద్ద పటమట పోలీసులు కారులో వస్తున్న హర్షవర్ధన్‌ను, అతనితోపాటు ఉన్న విజయకుమార్‌ అనే మరో విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని పశ్చిమ గోదావరి పోలీసులకు అప్పగించారు.

    English summary
    A television channel anchor Harshavardhan was taken into custody by the police on the charges of blackmailing in the late hours of Saturday. Police reported to have recovered Rs 1 crore from the possession of Harsha following a raid conducted on the hotel where he stayed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X