twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గిన్నిస్ రికార్డు దిశగా అంధుల సినిమా ‘వి’

    By Bojja Kumar
    |

    Guinness World Record
    ఆ సినిమాలో నటీనటులంతా అంధులే. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. 'వి" అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో వెండి తెరపైకి రాబోతోంది. స్లీప్‌లెస్‌ డ్రీమ్స్‌ పతాకంపై పి.మహేష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 'ముందుగా ప్రయాణం మొదలెట్టండి. హాయిగా ప్రయాణించి సుఖంగా గమ్యానికి చేరండి... అనే సందేశంతో ఈ సినిమా రూపొందుతోంది.

    ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ 'పూర్తిగా అంధులు నటిస్తున్న సినిమా ఇది. ప్రపంచంలోనే ఇదో రికార్డ్‌. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌‌స ప్రతినిధులు మా ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు అని తెలిపారు. ట్రాఫిక్‌లో తలెత్తే అనేక ఇబ్బందులే ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటాయన్నారు. అక్టోబర్‌ 15న సినిమా ప్రారంభిస్తామన్నారు. ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయంతో దాదాపు 400మంది అంధులకు శస్తచ్రికిత్సలు చేయించి చూపుని ప్రసాదిస్తామని" తెలిపారు. కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, విఎల్‌వి రావు, శ్రీనివాస్‌, శిరీష్‌, రమణ తదితరులు పాల్గొన్నారు. కెమెరా: తోట రమణ, ఎడిటింగ్‌: ఉమా మహేశ్వరరావు, కళ: మురళి, రచన: మార్ఫి, కథనం-దర్శకత్వం: వివేక్‌.

    English summary
    'V' movie. It is totally blind actor’s movie. This film directed by vivek and produced by P.Mahesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X