బ్లైండ్ రివేంజ్ డ్రామా...(శివతాండవం ప్రివ్యూ)
హైదరాబాద్ : విక్రమ్, అనుష్క, అమీజాక్స్ హీరో హీరోయిన్లుగా రూపొంది తమిళ చిత్రం 'తాండవం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'శివ తాండవం' పేరుతో ఈ రోజు విడుదల చేసారు. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. యు.టి. వి.మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. రోనీ స్ర్కూవాలా, సిద్ధార్థరాయ్‌కపూర్ నిర్మాతలు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.
కథ విషయానికొస్తే...ఇదో బ్లైండ్ రివేంజ్ డ్రామా. శివకుమార్(విక్రమ్) Raw ఏజెంట్. హ్యాపీగా మీనాక్షి(అనూష్క)తో మ్యారేడ్ లైఫ్ గడుపూతూంటాడు. ఆమె ఓ ఆప్తమాలజిస్ట్...ఎంతో మంది గుడ్డి వాళ్లకి ఆమె తన ఫౌండేషన్ ద్వారా వెలుగు చూపిస్తూంటుంది. శివకి బెస్ట్ ప్రెండ్, కొలీగ్ శరత్(జగపతిబాబు).
టెర్రరిస్టుల దాడిలో శివకుమార్ కళ్లు పోగొట్టుకోవడంతో పాటు భార్య మీనాక్షిని కూడా కోల్పోతాడు. గుడ్డివాడైనా పట్టువదలని దీక్షతో తెర్రరిస్టుల కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు, వారికి సాహాయం చేస్తున్న దేశ ద్రోహులకు బుద్ది చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో గుడ్డివాడైన శివకుమార్ కి సారా(అమీ జాక్సన్) పరిచయం అవుతుంది. చివకు కథ ఎలా సుఖాంతం అయింది అనేది తెరపై చూడాల్సిందే.
లక్ష్మీరాయ్, శరణ్య, సుజిత, కోట శ్రీని వాసరావు, నాజర్, సాయాజీ షిండే, ఎం.ఎం. భాస్కర్, ఢిల్లి గణేష్ ఇతన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాల్ని లండన్‌లో చిత్రీకరించారు. తెలుగులో ఈచిత్రానికి సంబంధించిన రిలీజ్ రైట్స్ నిర్మాత సి.కల్యాణ్ దక్కించుకున్నారు. జి.విపకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











