‘AD’ నిర్మాతకు బి.ఎన్.రెడ్డి అవార్డ్ (ఫోటోస్)
హైదరాబాద్: ప్రేక్షకులు మెచ్చే మంచి వినోదాత్మక చిత్రాలను తీస్తున్న నిర్మాతలను ప్రోత్సహించాలన్న ప్రయత్నంలో భాగంగా ప్రతి యేటా బి.నాగిరెడ్డి పురస్కారాన్ని ప్రధానం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ తొలినాళ్లలో నిర్మాతగా బి.నాగిరెడ్డి ప్రసిద్దికెక్కారు. విజయ సంస్థపై ఆయన ఎన్నో ప్రముఖ చిత్రాలు నిర్మించారు. బిఎన్.రెడ్డి వారసులు విజయ మెడికల్ అండ్ ఎడ్యూకేషనల్ ట్రస్ట్ తరుపున ఈ అవార్డులను బహూకరిస్తున్నారు.
2013 సంవత్సరానికి గాను బి.ఎన్.రెడ్డి అవార్డును 'అత్తారింటికి దారేది' చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌కు అందజేసారు. రూ. 1.5 లక్షల చెక్కు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజసారు. ఈ కార్యక్రమంలో వి.బి. రాజేంద్రప్రసాద్, సింగితం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, ఎస్.జానకి, విక్టరీ వెంకటేష్, శైలజా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అవార్డు అందుకున్న నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...నేను చిన్నతనంలో స్కూలు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లే వాడిని. వాటి గురించే నిత్యం మాట్లాడుకునే వాళ్లం. నేను నిర్మాతగా చెన్నై వెళ్లినపుడు విజయా గార్డెన్స్‌లో చక్రవర్తిగారు రికార్డింగ్ చేస్తుంటే అక్కడికి నాగిరెడ్డిగారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నేను అందుకున్న తొలి అవార్డు ఆయన పేరు మీద ఉన్న అవార్డు కావడం ఆనందంగా ఉంది అన్నారు.

చెక్కు అందుకుంటున్న దృశ్యం
బి.ఎన్.రెడ్డి అవార్డు అందుకున్న బివిఎస్ఎన్ ప్రసాద్‌కు రూ. 1.5 లక్షల చెక్కు అందజేసారు.

జ్ఞాపిక అందుకుంటున్న దృశ్యం
బి.ఎన్.రెడ్డి ప్రతిమతో కూడిన జ్ఞాపికను అందుకుంటున్న బివిఎష్ఎన్ ప్రసాద్.

గజమాలతో సత్కారం
నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌ను గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం.

సినీ ప్రముఖులు
బిఎన్ రెడ్డి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన సినీ ప్రముఖులు గొల్లపూడి మారుతిరావు, సింగితం శ్రీనివాస్, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్

ఎస్ జానకి
బిఎన్ రెడ్డి అవార్డు ప్రధానోత్సవ సందర్భంగా మాట్లాడుతున్న ప్రముఖ గాయని ఎస్. జానకి


Click it and Unblock the Notifications











