మహేష్ బాబు, త్రిష కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన అతడు సినిమా హిందీలోకి రీమేక్ అయ్యింది. ఏక్ పేరుతో బాబిడయోల్ హీరోగా ఈ చిత్రం క్రితం శుక్రవారం రిలీజయింది. అయితే ఆ సినిమా అక్కడ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అక్కడకి శ్రియ తన అందచందాలు ఆరబోసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఈ చిత్రం తెలుగులో హిట్టవటానికి కారణాలు మరో సారి అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మహేష్ మ్యాజిక్ నటన,త్రివిక్రమ్ కామిక్ సెన్స్ ఉన్న డైలాగులు, నిర్మాణవిలువలు ఈ సినిమాను కథను ప్రక్కన పెట్టి ఎంజాయ్ చేసేలా చేసాయి. అందుకే అక్కడ అంతంతమాత్రమై నిలిచిందంటున్నారు. మరో ప్రక్క మహేష్ పోకిరి చిత్రం కూడా సల్మాన్ ఖాన్ హీరోగా ప్రారంభమై చాలా కాలం అయినా ఇప్పటికీ పూర్తయి రిలీజ్ కాలేదు. ఏదైమైనా రీమేక్ చిత్రాలు చేసేటప్పుడు అవి ఒరిజనల్ లో ఆడటానికి కారణాలు బేరేజ్ చేసుకుని తీసుకుంటే్ మేలనేది కరెక్టు.