కన్నీళ్లు ఆగడం లేదు: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా బాబీ ట్వీట్
తనపై జరుగుతున్న కుట్రలు, తన తల్లిని తిట్టించి నీచానికి పాల్పడిన వ్యక్తులు, రాజకీయ, మీడియా శక్తులపై పవన్ కళ్యాణ్ చేపట్టిన న్యాయ పోరాటానికి అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించగా తాజాగా పవర్ స్టార్‌తో 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం చేసిన బాబీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
సర్.. గడిచిన 48 గంటలు నా జీవితంలో అత్యంత కఠినమైన క్షణాలు. మీరు బాధలో ఉన్నారని తెలిసినా.. మీరు ఆపడం వల్ల మేం స్పందించలేదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది చూస్తున్న తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోతున్నాను అని... బాబీ ట్వీట్ చేశారు.
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మీరు ఆడవారికి మీరు ఎంత గౌరవం ఇస్తారో? వారికి విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో? ఎంత ప్రొటెక్టివ్‌గా ఉంటారో నాకు తెలుసు. మీతో కలిసి పనిచేసినపుడు మిమ్మల్ని దగ్గరుండి గమనించాను. ఇప్పుడు మేం మీకంటే ఎక్కువ బాధపడుతున్నాం. ఎందుకంటే మీరు మీ తల్లికి మాత్రమే బిడ్డ కాదు.. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. మీకు నా సెల్యూట్. జైహింద్ అంటూ బాబీ ట్వీట్ చేశాడు.

ఇక పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఆప్తుడైన కోన వెంకట్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు అని.... మీ బాధ మా బాధ అంటూ కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











