"వరస్ట్ స్టోరీ.. వరస్ట్ డైలాగ్స్" అంటూ డైరక్ట్ గానే
''వరస్ట్ స్టోరీ.. వరస్ట్ డైలాగ్స్... స్టోరీ జీరో.. అయినా సినిమా (బాడీ గార్డ్) మాత్రం ఘన విజయం. ఇతన్నే (సల్మాన్) నా బాడీగార్డ్‌గా కోరుకుంటున్నాను'' అంటూ పూజా బేడీ ట్వీట్ చేసింది. ఆమె సల్మాన్ ఖాన్ తాజా చిత్రం బాడీ గార్డ్ ని చూసి ఇలా పోస్ట్ చేసింది. అలాగే ఈ మధ్యనే బాలీవుడ్ భామ బిపాసా బసు కూడా ఇదే కోరికను వ్యక్తం చేసింది. 'బాడీగార్ట్' సినిమా స్పెషల్ షో చూసిన బిపాసా(32) తన ట్విట్టర్ పేజ్‌లో ఇలా పోస్ట్ చేసింది...'' ఇప్పుడే బాడీగార్డ్ చూశాను. లవ్లీసింగ్ లాటి పక్కా బాడీగార్డ్ నాకు కూడా ఉంటే ఎంత బాగుండును'' అని రాసుకుంది. ఇటీవల 'దమ్ మారో దమ్' తో సహా వరుస ఫ్లాపులతో సతమవుతున్న బెంగాలీ బ్లాక్ బ్యూటీ బిపాసా బాసు ఏం చేయాలో తెలియని అయోమయంలో చిక్కుకున్నట్టుగా కనిపిస్తోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించిన చిత్రాల్లో నటించిన హీరోలను ఆకట్టుకునే పనిలో పడింది. 'వాంటెడ్', 'దబంగ్', 'రెడీ' చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై ఆమె కన్ను పడింది. అతడి సరసన నటించేందుకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. ఇంకేముంది ట్విట్టర్ ఖాతాలో తనకు బాడీగార్ట్ కావాలంటూ పోస్ట్ చేసింది. కాని బాడీగార్ట్ అలా ఇలా ఉండకూడదట. సల్మాన్‌ఖాన్ లాంటి 'బాడీగార్డ్' కావాలట. అదేనండి.. 'బాడీగార్ట్' చిత్రంలో బాడీగార్డ్ లవ్లీసింగ్ పాత్రలో సల్మాన్ నటించాడు. అతడికి జోడీగా కరీనాకపూర్ తెరపై కనిపించింది. సల్మాన్ తాజా చిత్రం 'బాడీ గార్డ్' తొలి రోజునే రూ.22 కోట్లు వసూళ్ళు సాధించి అంతకుముందు బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన 'దబాంగ్'.. '3 ఇడియెట్స్'ను దాటిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని వెంకటేష్ చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. డాన్ శీను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరక్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











