ఈనెల 13న వెంకీ ‘బాడీగార్డ్’ ఆడియో ఫంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ లు ఎవరంటే...?
మలయాళ, తమిళ, హిందీ భాషల్లో వచ్చిన 'బాడీగార్డ్' చిత్రాన్ని వెంకటేష్ కథానాయకుడుగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలినేని గోపీచంద్ డైరెక్షన్లో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగు దాదాపు పూర్తయింది. వెంకటేష్ 'బాడీగార్డ్'గా సిద్ధం అవుతున్నారు. ఓ పక్క వృత్తి ధర్మం... మరోపక్క ప్రేమానురాగం... ఈ రెండిటి మధ్య నలిగిపోయే పాత్రను ఆయన ఆ చిత్రంలో పోషిస్తున్నారు. వెంకటేష్ పాత్ర ఈ చిత్రంలోణతో పాటు గెటప్ కూడా సరికొత్తగా ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం.
కాగా, ఈ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 13 న హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబరు 13న వెంకటేష్ పుట్టిన రోజు కావడం విశేషం. నిన్నబాడీగార్డ్ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ విషయాన్నీ తెలియచేసారు. శిల్ప కళా వేదికలో జరపనున్న ఈ వేడుకకి ప్రభాస్ మరియు వివి వినాయక్ అతిధులుగా విచ్చేయనున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యుల్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. వెంకటేష్ సరసన త్రిషా నటిస్తుండగా సలోని మరో కీలక పాత్ర పోషిస్తుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











