ఘనంగా వెంకీ ‘బాడీగార్డ్’ ఆడియో రిలీజ్

ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ....కలియుగ పాండవులు చిత్రం నుంచి బాడీగార్డు వరకు ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. నేను ఈ స్థాయికి రావడానికి అభిమానుల ప్రోత్సాహమే కారణం. సినిమా కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. దర్శకుడు గోపీ, సంగీత దర్శకుడు తమన్, రామ్ లక్ష్మణ్ బాగా కష్ట పడ్డారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ...హిందీ, మళయాళంలో ఇప్పటికే బాడీగార్డు సినిమాలు వచ్చినా ఇది వెంకటేష్ గారి సినిమా, ఆయన స్టయిల్ లో తెలుగు వారికి నచ్చేలా ఉంటుందన్నారు.
ఈ కార్య మానికి నిర్మాత రామానాయుడు, బెల్లకొండ సురేష్, జ్వాల గుత్త, అక్ష, రామ్ లక్ష్మణ్, వేణు మాధవ్ తదితరులు హాజరయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది.


Click it and Unblock the Notifications











