Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
అభిమానులకు థాంక్స్ చెబుతున్న వెంకటేష్
విక్టరీ వెంకటేష్, త్రిష, సలోని ప్రధాన పాత్రల్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ రజత్ పార్థసారథి సమర్పణలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై లిమిటెడ్ బేనర్ పై నిర్మాత బెల్లకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన 'బాడీగార్డ్' సంక్రాంతికి విడుదలై అన్ని ముఖ్య కేంద్రాల్లో మార్చి 3కి 50 రోజులు పూర్తి చేసుకుని సెంచరీకి పరుగులు తీస్తోంది. ఈ సందర్భంగా హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ...''సంక్రాంతి కానుకగా వచ్చిన 'బాడీగార్డ్'ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. బెల్లంకొండ సురేష్ బేనర్ లో 'నాగవల్లి' తర్వాత చేసిన మరో హిట్ సినిమా 'బాడీగార్డ్'. డైరెక్టర్ గోపీ ఈ సబ్జెక్టుని బాగా డీల్ చేశాడు. ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కు, ఫ్యాన్స్‌కు థాంక్స్ చెపుతున్నాను'' అన్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...'' వెంకటేష్ బాబుతో బాడీగార్డ్ లాంటి హిట్ సినిమా చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది. 2012 సంక్రాంతి సూపర్ హిట్‌గా 'బాడీగార్డ్'ని ప్రేక్షకులు ఆదరించినందుకు కృతజతలు తెలియజేస్తున్నాను'' అన్నారు. దర్శకుడు గోపీ చంద్ మలినేని మాట్లాడుతూ ...'' వెంకటేష్ గారి లాంటి పెద్ద హీరోతో బెల్లంకొండ సురేష్ బేనర్లో చేసే అవకాశం రావడం, సినిమా పెద్ద హిట్ అవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారకులైన యూనిట్ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు'' అన్నారు. ఈ చిత్రానికి థమన్, మైనేని ప్రసాద్, శ్యామ్ కె. నాయుడు, కో వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, రామ్-లక్ష్మణ్ సాంకేతిక వర్గం.