జగపతిబాబు సినిమా రీమేక్ లో సల్మాన్
జగపతిబాబు,రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చి ప్లాపైన ఖుషీ ఖుషీగా చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది.దాదాపు ఎనిమేదేళ్ళ క్రితం వచ్చిన ఈ చిత్రం ఇఫ్పుడు హిందీలో రీమేక్ కానుంది.బాడీగార్డ్ ని దర్సకత్వం వహించిన సిద్దిక్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు.ఆయనే మళయాళంలో ఈ చిత్రాన్ని 'క్రానిక్ బ్యాచిలర్'టైటిల్ తో డైరక్ట్ చేసారు.దాంతో ఆయన్నే డైరక్టర్ గా పెట్టి ఈ చిత్రం రీమేక్ చేయాలని సల్మాన్ భావించి ఓకే చేయించుకున్నారు.ప్రస్తుతం సిద్దిక్ డైరక్ట్ చేసిన బాడీగార్డ్ మార్కెట్ లో మంచి క్రేజ్ తెచ్చుకోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నాయకానాయికలు. ఆగస్టు 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఇంతకుముందు సిద్దిక్ డైరక్ట్ చేసిన సినిమాలను రీమేక్ చేసి హిందీలో ప్రియదర్శన్ స్ధిరపడ్డారు.డైరక్ట్ గా సిద్దికే రంగంలోకి దిగటంతో ఇప్పుడు ప్రియదర్శన్ నోట్లో మట్టి కొట్టినట్లైంది.మరో ప్రక్క సల్మాన్ పోకిరి రీమేక్ చేసినప్పటినుంచి వరసగా సౌత్ సినిమాల రీమేక్ పనిలో పడ్డారు.తెలుగులో హిట్టైన రెడీ చిత్రాన్ని ఇప్పటికే రీమేక్ చేసారు.అలాగే త్వరలో కిక్ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











