'గంగా ది బాడీగార్డ్'...! టైటిల్ స్టైల్ మార్చిన వెంకీ...?
ఆడవాళ్ల పేర్లతో వెంకటేష్ హీరోగా రూపొందిన 'లక్ష్మీ", 'తులసి" చిత్రాలు ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి 'గంగ" అనే టైటిల్ తో ప్రేక్షకల ముందుకు రాబోతున్నాడు వెంకటేష్. మలయాళ చిత్రం 'బాడీగార్డ్" తెలుగు రీమేక్ లో వెంటేష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకుడు.
ఈ సినిమాకి 'గంగ ది బాడీగార్డ్" అని టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. గతంలో అమ్మ రాజశేఖర్ ఈ టైటిల్ తో వెంకటేష్ తో సినిమా చేయాలనుకున్నాడు కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ నేపధ్యంలో అమ్మ రాజశేఖర్ నుంచి ఈ టైటిల్ ని బెల్లంకొండ సురేష్ తీసుకున్నాడని సమాచారం. 'బాడీగార్డ్" చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..
ప్రసుతం హైదరాబాద్ గండిపేటలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. హీరోయిన్ సలోని కూడా ఇందులో నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











