2011 మోస్ట్ సెర్చెడ్ మూవీ 'బాడీగార్డ్'

By Srikanya

గూగుల్ లో 2011లో మోస్ట్ సెర్చెడ్ మూవీగా బాడీగార్డ్ నిలిచింది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాడీగార్డ్ చిత్రం ఈ కొత్త రికార్డును కూడా క్రియేట్ చేసింది. షారూఖ్ ఖాన్ రావన్ చిత్రం సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ప్రమోషన్ పై విపరీతంగా ఖర్చుపెట్టిన షారూఖ్ కి ఈ వార్త నిరాశపరిచేదే. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత స్ధానం అజయ్ దేవగన్ సింగంకు దక్కింది. సూర్య యముడు చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాకపోయినా విడుదలకు ముందు మంచి క్రేజ్ సంపాదించుకుని భారీ ఓపినింగ్స్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ప్లేసులో సల్మాన్ రెడీ, ఇమ్రాన్ ఖాన్ డిల్లీ బెల్లీ చిత్రాలు నిలిచాయి.

ఇక బాడీగార్డ్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ చేసారు. సంక్రాంతికి విడుదల అయ్యే బాడీగార్డ్ లో త్రిష హీరోయిన్ గా కనిపిస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరక్ట్ చేసారు. వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న వెంకటేష్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మలిచిన ఈ చిత్రంలో క్లైమాక్స్ హైలెట్ గా నిలుస్తుంది. అలాగే సినిమాలో సెంటిమెంట్ సైతం బాగా వర్కవుట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X