యూఎస్‌లో 3రోజుల ముందే వెంకీ ‘బాడీగార్డ్’

By Bojja Kumar

Bodyguard
విక్టరీ వెంకటేష్ నటించిన 'బాడీగార్డ్' సినిమా మనకంటే ముందే అమెరికాలో విడుదల కాబోతోంది. జనవరి 9న ఈ సినిమాను యూఎస్ లో విడుదల చేయనున్నట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిన్న జరిగిన బాడీగార్డ్ ఆడియో ఫంక్షన్ లో తెలిపారు. ఇండియాలో ఈ సినిమా జవవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న బాడీగార్డ్ సినిమాలో వెంకీ 'వెంకటాద్రి' పేరుతో బాడీగార్డు పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో త్రిషకు వెంకటేష్ బాడీగార్డు. మళయాళంలో వచ్చిన బాడీగార్డ్ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే ఈ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుని, సూపర్ కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని వెంకీతో పాటు, దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేశారు. ట్రైలర్స్ చూస్తుంటే వీరు కంపోజ్ చేసిన సన్నివేశాలన్నీ ఓ రేంజ్ లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. తమన్ అందించిన సంగీతానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X