మహేష్ తో పోటీగా వెంకటేష్ కూడా...

By Srikanya

మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ కు ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ వేసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో పాటే వెంకటేష్ హీరోగా చేస్తున్న బాడీగార్డ్ ను కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఓవర్ సీస్ లో మాత్రమే ఈ సినిమాను సబ్ టైటిల్సో తో విడుదల చేస్తారు. ఇందులో వెంకటాద్రి గా వెంకటేష్ బాడీగార్డ్ పాత్రను పోషిస్తున్నారు.వెంకీ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారని నిర్మాతలు చెప్తున్నారు. ''వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పడుతుంది, పట్టుకుంటే రక్తం పడుతుంది'' లాంటి డైలాగులు సినిమాలో బోలెడు ఉన్నాయి. ఇటీవల తెలుగు సినిమాల్లో పవర్ డైలాగులు, పంచ్ డైలాగులు బాగా పేలుతున్న నేపథ్యంలో...ఈ సినిమాలో ఈ తరహా ఎంటర్ టైన్మెంట్ పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

తన పాత్ర గురించి వెంకటేష్ మాట్లాడుతూ..నా పాత్ర పేరు వెంకటాద్రి.'చంటి' తర్వాత ఓ అమ్మాయికి బాడీగార్డుగా ఉండి కాలేజీ క్యాంపస్‌కి వెళ్లడం మళ్లీ ఈ చిత్రానికే. ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయి. లవ్ స్టోరీ ఈజ్ వెరీ యూనిక్'బాడీగార్డ్'గుడ్ క్లీన్ ఫిల్మ్. మలయాళ ఒరిజినల్ 'బాడీగార్డ్'తో పోలిస్తే మన అభిరుచికి తగ్గట్లు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశాం. ప్రేక్షకులకి మంచి ఫీల్‌నిస్తుంది. ఇందులో త్రిష, నేను ఇదివరకు కలిసి చేసిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' తర్వాత తనది ఇందులో మరో మంచి పాత్ర. చివరి 30 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. రామ్-లక్ష్మణ్ బాగా కంపోజ్ చేశారు అన్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బెల్లకొండ సురేష్ నిర్మిస్తున్నారు. వెంకీ సరసన త్రిష నటిస్తోంది. ఇందులో త్రిష పెద్దింటి అమ్మాయిగా, కాలేజీ గర్ల్ గా నటిస్తుండగా, ఆమెకు బాడీగార్డుగా వెంకీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా బాడీగార్డ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X