వెయ్యి థియేటర్లలో వెంకటేష్ హంగామా
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో వెంకటేశ్,త్రిష కాంబినేషన్ లో రూపొందిన'బాడీగార్డ్'ట్రైలర్లు విడుదలయ్యాయి. అలాగే విదేశాల్లో జనవరి 9న, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని మిగతా ప్రాంతాల్లో జనవరి 12న చిత్రాన్ని విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయమై మీడియా సమావేశం నిర్వహించి నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ "ఈ సినిమాతో గోపీచంద్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం వెంకటేశ్ సినిమాల్లో పెద్ద హిట్టవుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆడియో రాలేదని ఆదిత్య మ్యూజిక్‌వాళ్లు అంటున్నారు. మా బేనర్‌లో 'నా ఆటోగ్రాఫ్' తర్వాత అంత పెద్ద ఆడియో ఇదే అన్నారు.
ఇక హీరో వెంకటేశ్ మాట్లాడుతూ "సంగీతపరంగా పెద్ద స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది. తమన్ మంచి మెలోడీలిచ్చాడు. చూసేందుకు కూడా అన్ని పాటలూ రిచ్‌గా, అందంగా ఉంటాయి. ట్రైలర్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ వంటి అంశాలన్నీ మేళవించిన సినిమా. త్రిషకు చాలా మంచి పేరు తెచ్చే పాత్ర. ఇందులోని ప్రేమ కోణం తాజాగా ఉంటుంది.యాక్షన్ సన్నివేశాలు స్టయిలిష్‌గా ఉండి ఆకట్టుకుంటాయి అన్నారు. ఇక హీరోయిన్ త్రిష మాట్లాడుతూ..'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' తర్వాత మరో చక్కని పాత్ర చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని,వెంకటేశ్‌తో తనది మంచి కాంబినేషన్ అవడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయనీ, వాటిని ఈ సినిమా అందుకుంటుందనీ అన్నారు.
మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై బెల్లంకొండ సురేశ్, బెల్లంకొండ గణేశ్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. మైనేని ప్రసాద్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.


Click it and Unblock the Notifications











