twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ-రామ్ కాంబినేషన్ మూవీ తాజా అప్డేట్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి మల్టీ స్టారర్ హిట్ సినిమా చేసిన విక్టరీ వెంకటేష్ మరో మల్టీస్టారర్ సినిమా చోయబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ 'బోల్ బచ్చన్' చిత్రానికి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈచిత్రంలో వెంకీతో పాటు ఎనర్జిటిక్ హీరో రామ్ నటించబోతున్నాడు.

    వెంకీతో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలను తెరకెక్కించిన విజయభాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 13న లాంచనంగా సినిమాను ప్రారంభించి మార్చి 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రాచి దేశాయ్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ పాత్రలో వెంకీ, అభిషేక్ బచ్చన్ పాత్రలో రామ్ చేయబోతున్నారు. అయితే వీరి సరసన హీరోయిన్లుగా నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడి కానున్నాయి.

    ప్రస్తుతం వెంకటేష్ మొహర్ రమేష్ దర్శకత్వంలో 'షాడో' చిత్రంలో నటిస్తుండగా...... రామ్ మరో వైపు 'అందాల రాక్షసి' చిత్రంతో దర్శకునిగా మారిన హను రాఘవపూడి చిత్రం కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Venkatesh and Ram Bol Bachchan’s remake launched on March 13 and regular shooting will commence from March 22. Vijay Bhaskar is going to direct the film and this will be his third film with Venkatesh after Nuvvu Naaku Nachchav and Malleswari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X