గతేడాది శృంగార రసం ఒలికించిన సినిమాలు (ఫోటోస్)
ముంబై: సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రేక్షకులు రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా మంది ప్రేక్షకుల్లో కామన్ అభిప్రాయం ఉంటుంది. సినిమాలో నవ రసాలు ఉన్నా లేక పోయినా.....శృంగార రసం మాత్రం ఉండాలని కోరుకునే వారు ఎందరో. చాలా మంది ఈ విషయం బయటకు చెప్పక పోయినా....లోలోన మాత్రం వారిలో ఆ కోరిక ఉంటుంది.
అలాంటి వారి కోరికను బాగా పసిగట్టిన దర్శకులు కూడా తమ సినిమాల్లో శృంగార రసం ఎంతో కొంత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గత సంవత్సరం మాత్రం ఇలాంటి శృంగార రసం నిండిన సినిమాలు బాగానే వచ్చాయి. పలువురు సినిమా తారలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అలాంటి సీన్లలో తమ శక్తిమేర నటించారు.
ఇక కొత్తగా ఎంటరైన సన్నీ లియోన్, పూనమ్ పాండే లాంటి వారు....అవసరానికి మించి సెక్సీగా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసారు. అలాంటి సినిమాలు, సినిమా తారలకు సంబంధించిన వివరాలపై స్లైడ్ షోలో ఓ లుక్కేయండి.

రామ్ లీలా
రామ్ లీలా చిత్రంలో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ ఓ రేంజిలో రొమాంటిక్ సీన్లు పండించారు. శృంగార సన్నివేశాలు, డైలాగులతో స్క్రీన్ వేడెక్కించారు.

కంగనా, జాన్ అబ్రహం
షూటౌట్ ఎట్ వాడాలా అనే బాలీవుడ్ చిత్రం పెద్దగా ఆడక పోయినా...ఇందులో జాన్ అబ్రహం, కంగనా రనౌత్‌లపై చిత్రీకరించిన హాట్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బిఏ పాస్
గత సంవత్సరం వచ్చిన శృంగార భరిత చిత్రాల్లో బిఏ పాస్ ఓ సెన్సేషన్. ఈ చిత్రంలోని శృంగార సన్నివేశాలు, డైలాగులు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇంకార్
ఇంకార్ చిత్రంలో అర్జున్ రాంపాల్, చిత్రాంగద సింగ్ మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు హాట్ అండ్ సెక్సీగా ఉన్నాయనే టాక్ తెచ్చుకున్నాయి.

పూనమ్ పాండే
నషా చిత్రం ద్వారా హీరోయిన్‌గా మారిన పూనమ్ పాండే శృంగార సన్నివేశాల్లో అవసరానికి మించి రెచ్చిపోయింది. నటుడు శివం పాటిల్‌తో కలిసి బెడ్రూం సీన్లు ఇరగదీసింది.

సన్నీ లియోన్
సన్నీ లియోన్, సనిన్ జోషి కలిసి నటించిన ‘జాక్ పాట్' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డప్పటికీ....ఆ సినిమాలోని హాట్ సీన్లు మాత్రం చర్చనీయాంశం అయ్యాయి.

జాన్-చిత్రాంగద సింగ్
ఐ, మి ఔర్ మే చిత్రంలో జాన్ అబ్రహం, చిత్రాంగద సింగ్ హాట్ అండ్ సెక్సీగా బెడ్రూం సీన్లలో నటించిన శృంగార ప్రియులను ఆకట్టుకున్నారు.

శృతి హాసన్
డి-డే అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ వేశ్య పాత్రలో నటించింది. బాలీవుడ్ హీరో
అర్జున్ రాంపాల్తో కలిసి అమ్మడు హాట్ సీన్లలో నటించింది.

దీపిక-సైఫ్
దీపిక పదుకోన్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన ‘రేస్-2' చిత్రంలో కూడా హాట్ సీన్లు ఆకట్టుకున్నాయి. వీరితో పాటు ఈ చిత్రంలో జాన్ అబ్రహం-జాక్వెలిన్, అనిల్ కపూర్-అమీషా పటేల్ మధ్య హాట్ సీన్లు బాగున్నాయి.

అనుష్క-ఇమ్రాన్
అనుష్క శర్మ-ఇమ్రాన్ ఖాన్ కలిసి నటించిన చిత్రం ‘మాత్రు కి బిజిలీ కా మండోలా'. ఈ చిత్రంలో ఇద్దరిపై చిత్రీకరించిన హాట్ అండ్ సెక్సీ సీన్లు ఆకట్టుకున్నాయి.

సోహా అలీ ఖాన్-ఇర్ఫాన్ ఖాన్
సాహెబ్ బివి ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్ అనే చిత్రంలో సోహా అలీ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ మధ్య హాట్ సీన్లు ఆకట్టుకున్నాయి.

3జి
3జి చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్‌లు హాట్ హాట్ సీన్లలో నటించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

శుద్ధ్ దేశీ రొమాన్స్
శుద్ధ దేశీ రొమాన్స్...చిత్రంలో సుశాంత్ సింగ్, పరిణీతి చోప్రా రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయారు. ఈ ఇద్దరి రొమాన్స్ సినిమాకు హైలెట్‌గా మారింది.

రాజ్జో
కంగనా రనౌత్ నటించిన వివాదాస్పద చిత్రం ‘రాజ్జో'లో కూడా హాట్ సీన్లు బాగానే ఉన్నాయి.

లూటేరా
సోనాక్షి సిన్హా, రణవీర్ సింగ్ నటించిన ‘లూటేరా' చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

అదితి రావు, రణదీప్ హుడా
మర్డర్ 3 చిత్రంలో అదితి రావు హైదరి, రణదీప్ హుడా మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications











