పోస్టర్స్ తగలపెట్టారు..వివాదం మొదలైంది
ముంబై : ఈ నెల 26న దేశవ్యాప్తంగా విడుదలవుతున్న 'నషా' చిత్రానికి సంబంధించి వల్గర్ గా ఉన్నాయంటూ పోస్టర్ల పై వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పోస్టర్స్ కే ఇంత హంగామా చేస్తున్న వాళ్లు ఆ సినిమా రిలీజైతే ఇంకేం చేస్తారోనని ఆశ్చర్యం వ్యక్తం చేసింది నటిగా మారిన మోడల్ పూనమ్ పాండే.
'జిస్మ్' ఫేమ్ అమిత్ సక్సేన్ డైరెక్ట్ చేసిన 'నషా'తో ఆమె హీరోయిన్‌గా పరిచయమవుతోంది. పూనమ్ అర్ధనగ్న పోజులతో ఉన్న ఆ సినిమా పోస్టర్లను శుక్రవారం ఢిల్లీలో, శనివారం ముంబైలో కొంతమంది ఆందోళనకారులు తగులబెట్టారు. ఆ సినిమా ప్రచారం నిమిత్తం ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సంఘటనలపై స్పందిస్తూ తన పోస్టర్ల కంటే వల్గారిటీ ఎక్కువ ఉన్న పోస్టర్లు ముంబైలో ఎక్కువగానే ఉన్నాయనీ, వాటిని వదిలేసి తన పోస్టర్లనే ఎందుకు పట్టించుకుంటున్నారో అర్థం కావడం లేదనీ చెప్పింది.
ఈ సినిమాలో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలున్న మాట నిజమే. కానీ వాటితో పాటు ప్రేక్షకుల్ని అలరించే అంశాలు చాలానే ఉన్నాయి. నా నటనా సామర్థ్యాన్ని వెలికి తీస్తుందనే ఉద్దేశంతోటే ఈ సినిమా చేశాను. 'జిస్మ్'ను డైరెక్టర్ అమిత్ ఎలా తీశాడో మీకు తెలుసు. అలాగే 'నషా'నూ ఆయన ఆసక్తికరంగా రూపొందించారు. నా నటనను ప్రేక్షకులు మెచ్చుకుంటారని ఆశిస్తున్నా. సినిమాలో నేను కనిపించిన తీరు వారిని ఆకట్టుకుంటుంది అంది.
ఇక ఈ చిత్రం పద్దెనిమిదేళ్ల అబ్బాయికీ, పాతికేళ్ల యువతికీ మధ్య జరిగే ప్రేమకథ. పాతికేళ్ల అమ్మాయిలా కనిపించడం కోసం జంక్‌ఫుడ్ తిని ఐదు కేజీల బరువు పెరిగాను అని తెలిపింది. అవకాశం వస్తే తెలుగు నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది ఈ మాజీ కింగ్‌ఫిషర్ మోడల్.
పూనమ్ పాండే నటిస్తున్న 'నషా' చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. శృంగార రసం అసలు టేస్టు ఏమిటో తన సినిమా ద్వారా చూపిస్తానని గతంలోనే ప్రకటన చేసిన పూనమ్, చెప్పినట్లుగానే ఓ రేంజిలో హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోతోంది. ఇంత కాలం ట్విట్టర్‌లో సెమీ న్యూడ్ ఫొటోల దగ్గరనుంచి, దాదాపు న్యూడిటీ ప్రదర్శించే ఫొటోలదాకా.. పూనమ్ పాండే చేసే హంగామా అంతా ఇంతా కాదు. 'నషా' సినిమాతో నటిగా తెరంగేట్రం చేస్తున్న పూనమ్ పాండే తన అభిమానులకు అందాల విందు చేయబోతోంది.


Click it and Unblock the Notifications












