అభిమానులు ఆదుకోకపోతే కిడ్నీ అమ్మేస్తా.. కరెంట్ బిల్లు చూసి మరో స్టార్ యాక్టర్ షాక్

సాధారణంగా సమ్మర్ లో కరెంట్ బిల్లులు ఎక్కువగా షాక్ ఇస్తుంటాయి. కానీ ఈ సారి కరోనా దెబ్బకు వర్షాకాలంలో కూడా కరెంట్ బిల్లులు హార్ట్ ఎటాక్ ని తెప్పిస్తున్నాయని జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక సెలబ్రెటీస్ అయితే ఉహీంచని విధంగా స్పందిస్తున్నారు. ఆస్తులు అమ్ముకోవాలని కొందరు అంటుంటే.. అభిమానులు ఆదుకోవాలని మరికొందరు కోరుకుంటున్నారు. ఇటీవల మున్నాభాయ్ యాక్టర్ అర్షద్ వార్సీ కూడా అదే తరహాలో అసహనం వ్యక్తం చేయడం వైరల్ గా మారింది.

పట్టపగలే చుక్కలు..

పట్టపగలే చుక్కలు..

లాక్ డౌన్ లో కరెంట్ బిల్లులు చాలా వరకు పట్ట పగలే చుక్కలు చూపించాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా నెంబర్లు చాలా స్పీడ్ గా పెరిగిపోతున్నాయని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తుండగా బాలీవుడ్ నటులు కూడా విభిన్నంగా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అభిమానులే కాపాడాలి..

అభిమానులే కాపాడాలి..

తనకు ఏకంగా లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని ఈ ఇబ్బంది నుంచి నన్ను అభిమానులే ఆదుకోవాలని బాలీవుడ్ నటుడు అర్షద్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. లేదంటే తన కిడ్నీలను అమ్ముకోవాల్సి ఉంటుందని కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యనికి గురి చేసింది. ఇక ఈ విషయంపై అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఎఈఎమ్ఎల్) వెంటనే స్పందించింది.

వాటిని వేలం వేయాల్సిందే..

వాటిని వేలం వేయాల్సిందే..

లక్ష రూపాయలు విద్యుత్ బిల్లు కట్టడానికి తన దగ్గర ఉన్న పెయింటింగ్స్ ని వేలం వేస్తానని అందుకు అభిమానులు సహకరించాలని కోరగా అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ అతని బిల్లులో వచ్చిన పొరపాటున సరి చేసి సమస్యను పరిష్కరించింది. ఇటీవల తాప్సితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా కరెంట్ బిల్లులపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

బిజీ యాక్టర్.. ఇలా మొదటిసారి..

బిజీ యాక్టర్.. ఇలా మొదటిసారి..

ఇక అర్షద్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. సపోర్టింగ్ పాత్రలతో బాలీవుడ్ లో మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మున్నాభాయ్ MBBS సినిమాలో సర్క్యూట్ పాత్ర ద్వారా మంచి క్రేజ్ అందుకున్న అర్షద్ ప్రస్తుతం బాలీవుడ్ బిజీగా ఉన్న నటుల్లో ఒకరు. ఇకపోతే ఈ నటుడు చాలా రోజుల తరువాత కరెంట్ బిల్లుతో ఇంటర్నెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా నిలవడం విశేషం..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X