twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్ షోలే యాక్టర్ మృతి.. మరొక సెలెబ్రిటీ మరణంతో విషాదంలో సినీ లోకం

    |

    బాలీవుడ్‌ను మరో విషాదం కలిచివేసింది. బాలీవుడ్‌లో నటులుగా రాణిస్తున్న జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీ తండ్రి, ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూశారు. షోలే చిత్రం ద్వారా అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న జగదీప్ ముంబైలో వృద్దాప్య సంబంధింత సమస్యలతో కన్నుమూశారు. దీంతో 2020 సంవత్సరం చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది అనడానికి మరో ఘటన ఉదాహరణగా నిలిచింది. ఓ వైపు కరోనా వైరస్ అనేక ఇబ్బందులను కలిగిస్తుంటే మరోవైపు స్టార్ సెలబ్రెటీస్ మృతి చెందడం తీవ్ర మనోవేదనకు కలిగిస్తోంది. జగదీప్ మరణం సినీ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. జగదీప్ గురించి వివరాల్లోకి వెళితే...

    బాలీవుడ్ బెస్ట్ కమెడియన్ గా..

    బాలీవుడ్ బెస్ట్ కమెడియన్ గా..

    ఆ యాక్టర్ మరెవరో కాదు. 1980లలో బాలీవుడ్ లో బిజీగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన జగ్‌దీప్. 81ఏళ్ళ వయసు కలిగిన కమెడియన్ జగ్‌దీప్ అంటే తెలియని బాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. మూడు దశాబ్దాల వరకు ఆయన. కమెడియన్ గా హిందీ సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉండేవారు. ఇక గత రాత్రి ఆయన తుది శ్వాస విడువడం బాలీవుడ్ సినీ ప్రముఖులను కలచి వేసింది.

     అనారోగ్య సమస్యలతో..

    అనారోగ్య సమస్యలతో..

    వయసు పైబడడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఉండడంతొ జగ్‌దీప్ ప్రాణాలు వీడిచినట్లు తెలుస్తోంది. గతంలో పెద్దగా అనారోగ్యానికి గురవ్వని ఆయన ఇటీవల మంచానికె పరిమితమయ్యారు. అయితే కుటుంబ సభ్యులు పలు హాస్పిటల్స్ కి తీసుకు వెళ్లినప్పుటికీ ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు.

     దాదాపు 400సినిమాలు..

    దాదాపు 400సినిమాలు..

    జగ్‌దీప్ అసలు పేరు సయ్యద్ ఇస్థియాక్ జాఫ్రీ. బాలీవుడ్ లో అయన దాదాపు 400పైగా సినిమాల్లో నటించారు. బాలనటుడిగా 10 ఏళ్ల వయసు నుంచే సినీ కెరీర్ ని స్టార్ట్ చేసిన జగ్‌దీప్ 1970 నుంచి 1990 వరకు బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగారు. అప్పట్లో ఆయన నటించని సినిమాలు ఉండేవి కావు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    అమితాబ్ షోలే సినిమాలో..

    అమితాబ్ షోలే సినిమాలో..

    ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్ గా నిలిచిన అమితాబ్ షోలేలో కూడా ఆయన నటించారు. ఆ సినిమాలో సూర్మా భూపాలిగా ఆయన చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఇక జగ్‌దీప్ అకాల మరణంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

    English summary
    Another tragedy occurred in Bollywood. Jagdeep, who became a comedian in the history of Indian cinema, died a few hours ago. When the news of her death came to light at dawn today, the Bollywood film industry was suddenly struck.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X