జంజీర్ ‘ప్రాణ్’కు... దాదా పాల్కే అవార్డ్
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రాణ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే'దాదా సాహెబ్ పాల్కే' అవార్డు దక్కింది. ఈ మేరకు శుక్రవారం కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది. భారత సినీరంగంలో 'దాదా సాహెబ్ పాల్కే అవార్డు' అత్యున్నత సినీ పురస్కారం.
ప్రాణ్ 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి. అదే విధంగా అనే సినిమాల్లో క్యారెక్టటర్ ఆర్టిస్టుగా వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. ప్రాణ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి పలు అవార్డులు పొందారు. 2001లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు బహూకరించింది.
కొదమ సింహం చిత్రంలో ప్రాణ్ విలన్ పాత్రలో అలరించారు. 1973లో వచ్చిన అమితాబ్ బచ్చన్ జంజర్ చిత్రంలో ప్రాణ్ షేర్ ఖాన్ పాత్ర పోషించారు. ఇప్పడు రూపొందుతున్న జంజీర్ రీమేక్ చిత్రంలో షేర్ ఖాన్ పాత్రను హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications












