రాజమౌళి కోసం డేట్స్ ఫిక్స్ చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్.. మిస్సయితే మళ్ళీ దొరకదట

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం షూటింగ్స్ మొదలు పెట్టాలని చాలా మంది దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా షూటింగ్స్ కి గత ఆరు నెలల నుంచి బ్రేకులు పడుతున్నాయి. ఇక తెగించి షూటింగ్స్ స్టార్ట్ చేసిన వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఇక ఫైనల్ గా RRR సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని దర్శకుడు రాజమౌళి కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.

ఓ వైపు కరోనా వైరస్ ఇంకా పెరుగుతూనే ఉంది. మరోవైపు స్టార్స్ కూడా రిస్క్ చేయకుడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఇక RRR షూటింగ్ పై ఇటీవల దర్శకుడు రాజమౌళి చిత్ర యూనిట్ తో కాన్ఫరెన్స్ వీడియో కాల్ ద్వారా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అందులో బాలీవుడ్ స్టార్స్ కూడా పాల్గొన్నారట. ముఖ్యంగా అలియా భట్ షెడ్యూల్ పై జక్కన్న చాలా సేపు మాట్లాడినట్లు సమాచారం. దీంతో అలియా కూడా ఒక ఫైనల్ డిసిషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది.

Bollywood actress alia bhatt bulk dates for RRR

నవంబర్, డిసెంబర్ రెండు నెలలు పూర్తిగా RRRకోసమే కేటాయిస్తానని అందుకు తగ్గట్టు షెడ్యూల్ రెడీ చేసుకోవాలని కూడా ఆమె దర్శకుడికి వివరణ ఇచ్చిందట. ఒకవేళ ఆ నెలలో కుదరకపోతే మళ్ళీ డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టమవుతుందని ముందుగానే ఒక కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అలియా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి.

RRR కంటే ముందే కొన్ని సినిమాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ అగ్రిమెంట్ ప్రకారం ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆమెకు కొంత గ్యాప్ దొరకడంతో RRR సినిమాను పూర్తి చేయాలని అనుకుంటోంది. మరి రాజమౌళి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X