Alia Bhatt Pregnant: తల్లి కాబోతున్న ఆలియా భట్.. పెళ్లైన మూడో నెలకే శుభవార్త.. స్కానింగ్ పిక్ వైరల్

సినీ రంగంలో అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటు ప్రేమాయణం సాగించడం.. నచ్చితే పెళ్లి చేసుకోవడం.. లేకుంటే విడిపోవడం వంటివి అక్కడ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఐదేళ్లుగా లవ్ ట్రాక్ నడిపి.. తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లారు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్. గత ఏప్రిల్‌లోనే వైవాహిక బంధంతో అధికారికంగా ఒక్కటై అభిమానులను ఖుషీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట మరో శుభవార్తను చెప్పింది. పెళ్లైన మూడో నెలలోనే ఆలియా భట్ ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

ఐదేళ్ల బంధం.. పెళ్లితో ఒక్కటై

ఐదేళ్ల బంధం.. పెళ్లితో ఒక్కటై

బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఎప్పుడో వివాహం చేసుకోవాల్సి ఉండగా.. పలు అనివార్య కారణాల వల్ల వివాహం తరచూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 14వ తేదీని ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెద్దల సమక్ష్యంలో అగ్నిసాక్షిగా ఒక్కటైన విషయం తెలిసిందే.

వైవాహిక జీవితం... సినిమాలు

వైవాహిక జీవితం... సినిమాలు

ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ వివాహం తర్వాత కూడా తమ కెరీర్‌లను చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరూ పలు చిత్రాలను కూడా పూర్తి చేసుకున్నారు. అందులో జంటగా నటిస్తోన్న 'బ్రహ్మాస్త్ర' ఒకటి. ఇది కాకుండా రణ్‌బీర్ 'షంషేరా', 'యానివల్' మూవీలు చేస్తున్నాడు. ఆలియా 'డార్లింగ్స్', 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' వంటి చిత్రాలు చేస్తోంది.

బేబీ రాబోతుందని పోస్ట్ చేస్తూ

బేబీ రాబోతుందని పోస్ట్ చేస్తూ

తమ వివాహ బంధంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ తాజాగా మరో శుభవార్తను చెప్పారు. ఈ మేరకు వాళ్ల సోషల్ మీడియా ఖాతాల్లో ఆలియా స్కానింగ్ చేయించుకుంటోన్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు, 'మన బేబీ వచ్చేస్తుంది' అంటూ ఒకరికొకరు చెప్పుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. దీంతో ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

 తల్లి కాబోతున్న ఆలియా భట్

తల్లి కాబోతున్న ఆలియా భట్

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ తల్లి కాబోతుందని తాజాగా చేసిన పోస్ట్ ద్వారా అర్థం అవుతోంది. స్కానింగ్ చేయించుకుంటోన్న పిక్‌తో పాటు రెండు సింహాలు.. ఓ చిన్న సింహం కూనతో కలిసున్న ఫొటోను కూడా ఆలియా షేర్ చేసింది. దీంతో ఆమె గర్భవతి అయిందని స్పష్టం అవుతోంది. దీంతో వీళ్లిద్దరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సెలెబ్రిటీలు శుభాకాంక్షలతో

సెలెబ్రిటీలు శుభాకాంక్షలతో

ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పేరెంట్స్ కాబోతున్నారని ప్రకటించిన వెంటనే వాళ్లకు సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ఈ సినీ జంట చేసిన పోస్టుకు కామెంట్ల రూపంలో విషెస్ తెలియజేశారు. దీంతో ఆలియా భట్ ప్రెగ్నెన్సీ న్యూస్ హైలైట్ అవుతోంది. ఫలితంగా వీళ్లిద్దరి పేర్లు ట్రెండింగ్ అవుతున్నాయి.

పెళ్లైన మూడో నెలలోనే వార్త

పెళ్లైన మూడో నెలలోనే వార్త

ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ వివాహం ఏప్రిల్ 14వ తేదీన జరిగింది. అంటే.. వివాహం జరిగి మూడు నెలలు కూడా కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా ఆలియా గర్భవతి అయిందన్న ప్రకటన వెలువడింది. దీంతో చాలా మంది షాక్ అవుతూ చిత్ర విచిత్రమైన కామెంట్లను కూడా పెడుతున్నారు. ఫలితంగా ఈ ప్రెగ్నెన్సీ న్యూస్‌పై రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X