»   » హాట్ బ్యూటీ అనుష్క ప్రేమకలాపాలు..(ఫోటో ఫీచర్)

హాట్ బ్యూటీ అనుష్క ప్రేమకలాపాలు..(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా ఎఫైర్ల విషయంలో అమ్మడు యమా ఫాస్ట్‌గా ఉంది. ఇప్పటి వరకు ఆమెకు పలువురు సెలబ్రిటీలతో ఎఫైర్ల ఉన్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం అనుష్క వర్మ విరాట్ కోహ్లితో ప్రేమబంధంలో మునిగి తేలుతోంది.

లైఫ్‌ను ఎంజాయ్ చేసే తత్వం, పబ్లిసిటీ, పాపులారిటీ పెంచుకోవాలనే తాపత్రయంతో సెలబ్రిటీలు ఎఫైర్ల దారి పడుతారనే ఓ వాదన కూడా ఉంది. ఎప్పుడూ ఎఫైర్లతో వార్తల్లో హాట్ టాపిక్‌‍గా ఉండే భామలకే ఫాలోయింగ్, పాపులారిటీ, పబ్లిసిటీగా బాగా పెరుగుతోంది. దీంతో పాటు వారికి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.

అనుష్క శర్మ ఇప్పుడంటే విరాట్ కోహ్లితో డీప్ లవ్ లో ఉంది కానీ...అంతకు ముందు మరో ఆరుగురు స్టార్స్ కూడా ఆమె బాయ్ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

జోహెబ్ యూసఫ్

జోహెబ్ యూసఫ్


సినిమాల్లోకి రాక ముందు అనుష్క శర్మ మోడిలింగ్ చేసేది. అప్పుడు జోహెబ్ యూసఫ్ అనే తన తోటి మేల్ మోడల్‌తో సన్నిహితంగా ఉండేది. ఇద్దరూ రెండేళ్ల పాటు ఎఫైర్ నడిపారు. అయితే అనుష్క సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

రణవీర్ సింగ్

రణవీర్ సింగ్


బ్యాండ్ బాజా భారత్ చిత్రం ద్వారా పరిచయమైన అనుష్క శర్మ, రణవీర్ సింగ్ చాలా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్


కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ఓ విందులో రణబీర్, అనుష్క మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ కొంతకాలం సన్నిహితంగా గడిపారు. దీంతో ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే వార్తలు వెలువడ్డాయి.

షాహిద్, అనుష్క

షాహిద్, అనుష్క


ఇమ్రాన్ ఖాన్ నటించిన ‘మేరే బ్రదర్ కి దుల్హన్' సక్సెస్ పార్టీలో షాహిద్, అనుష్క ముద్దు పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజమెంతే ఇప్పటికీ తేలలేదు.

సురేష్ రైనా

సురేష్ రైనా


ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనాతో అనుష్క ప్రేమాయణం సాగించిన అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అర్జున్ కపూర్

అర్జున్ కపూర్


బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, అనుష్క శర్మ కొన్ని ప్రాంతాల్లో కలిసి పర్యటించడం, సన్నిహితంగా మెలగడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

విరాట్ కోహ్లి

విరాట్ కోహ్లి


విరాట్ కోహ్లి-అనుష్క శర్మ మధ్య ఉన్న లవ్ ఎఫైర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ప్రేమమైకంలో పడి విరాట్ కోహ్లి ఆటలో ఫెయిల్ అవుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకున్నారు కూడా.

English summary
Anushka Sharma has been making headlines for her close proximity with cricketer Virat Kohli. While she is keeping her relationship a secret, the couple have been often caught hanging out together. Virat is the latest person to be dating Anushka, before that his leggy lass had dated many men.
Please Wait while comments are loading...