మద్యం మత్తులో ప్రముఖ నటిపై దారుణం.. క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
దేశ సినీ రాజధాని ముంబై పరిధిలోని గోరేగావ్‌లో ప్రముఖ నటిపై క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం సంచలనం రేపింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో హిందీ సినీ వర్గాలు షాక్ గురయ్యాయి. తనపై జరిగిన ఘోరాన్ని పోలీసుల దృష్టికి నటి తీసుకు రావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రముఖ నటి పేరును గోప్యంగా ఉంచుతున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ముంబై పోలీసుల కథనం ప్రకారం
ముంబై పోలీసులు వెల్లడించిన ప్రకారం.. హిందీ, మరాఠీ భాషకు సంబంధించిన ప్రముఖ నటిపై అత్యాచారం జరిగింది. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి ఒక కారులో, క్యాబ్ డ్రైవర్ మరో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారు. తన వాహనాన్ని ఢీకొట్టడంతో క్యాబ్ డ్రైవర్‌తో ఘర్షణకు దిగింది అని తెలిపారు.

హాస్పిటల్ వద్ద గొడవ ప్రారంభమై..
మరాఠీ నటికి, క్యాబ్ డ్రైవర్‌కు ఓ హాస్పిటల్ వద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో మాటామాట పెరిగి క్యాబ్ డ్రైవర్‌పై నటి చేయి చేసుకోబోయింది. దాంతో ఆమె చేతిని పట్టుకొని దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆపై ఆమెను దుర్భాషలాడారు అని పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడిని గుర్తించి అరెస్ట్
ప్రముఖ నటి ఫిర్యాదు మేరకు క్యాబ్ డ్రైవర్‌ను ప్రీతమ్ వర్మగా గుర్తించాం. ఫిర్యాదు ఆధారంగా వర్మను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశాం. వేధింపులు, దాడి అంశాలపై క్యాబ్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారించాం అని పోలీసులు పేర్కొన్నారు.

జుడిషియల్ కస్టడీ తరలింపు
నిందితుడు ప్రీతమ్ వర్మపై ఐపీసీ సెక్షన్ 354, 503, 323, 506 కింద కేసు నమోదు చేశాం. దాడి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం దాడికి దిగడం, నేరపూరిత చర్య అనే అంశాల ఆధారంగా కేసు బుక్ చేశాం. నిందితుడిని జుడిషియల్ కస్టడీకి తరలించాం. తదుపరి విచారణ ప్రారంభించాం అని పోలీసులు మీడియాకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











