18 కోట్ల లోన్ తీర్చేశాను.. అయినా నీచమైన పనులు చేస్తున్నారా? ప్రీతీ జింటా ఫైర్!
బాలీవుడ్ నటి ప్రీతీ జింటా తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్తో కూస్తో తెలిసిందే. సౌత్ లోనూ హిందీ చిత్రాలను ఆదరించే వారుండటంతో ప్రీతీ జింటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ దర్శకుడు మణిరత్నం 'దిల్ సే' చిత్రంతో ఈమెను వెండితెరకు పరిచయం చేశారు. షారుఖ్ ఖాన్ హీరోగా నటించారు. ఆ తర్వాత హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. 2016 వరకు వరుస చిత్రాలతో నార్త్ ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రీతీ జింటా తన రేంజ్ కు తగ్గ సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రీతీ జింటా త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ కూడా ఆ మధ్యన ప్రచారం జరిగింది. గతంలో రాజ్యసభ ఆఫర్ వచ్చినా ప్రీతీ వద్దని చెప్పిందంట. ఈ క్రమంలోనే పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఈ బ్యూటీ పేరు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఇండియాలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ ప్రీతీ జింటాపై ఆరోపణలు చేసింది.

న్యూ ఇండియా కోఆపరేటీవ్ బ్యాంక్ నుంచి ప్రీతీ జింటాకు రూ.18 కోట్ల రుణం అందిందని ఆ పార్టీ ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. అందుకు గాను బీజేపీ పార్టీకి ప్రీతీ జింటా సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాండిల్ చేసే వెలుసుబాటును కల్పించిందని పరస్పర ఆరోపణలు వచ్చాయి. కేరళ కాంగ్రెస్ అఫీషియల్ అకౌంట్ లో ప్రీతీ జింటాకు రూ.18 కోట్ల రుణం మాఫీ అయ్యిందని, బీజేపీకి తన సోషల్ మీడియాపై రైట్స్ ఇచ్చినందుకే ఈ సౌలభ్యం కుదిరిందని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రీతీ జింటా వెంటనే స్పందించారు.
ఆరోపణలపై ప్రీతీ జింటా స్పందిస్తూ అవన్నీ అవాస్తవాలని తేల్చింది. ఈమేరకు సోషల్ మీడియాలో నోట్ కూడా రిలీజ్ చేసింది. కేరళ కాంగ్రెస్ తన మీద చేస్తున్న అసత్యపు ప్రచారాన్ని ఖండించింది. ఆ పార్టీ అఫీషియల్ పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. తనపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టింది... తన సోషల్ మీడియాలో అకౌంట్స్ ను తానే స్వయంగా హ్యాండిల్ చేస్తానని చెప్పారు. అలాగే తనకు ఎలాంటి లోన్ రద్దు కాలేదని చెప్పారు. ముఖ్యంగా రూ.18 కోట్లకు సంబంధించిన లోన్ పదేళ్ల కిందనే తిరిగి చెల్లించానని వివరించారు.
అయినప్పటికీ పొలిటికల్ పార్టీలు ఇలా తనపై నీచమైన ప్రచారం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తన పేరును, చిత్రాలను ఉపయోగించి చేస్తున్న ప్రచారానికి షాక్ అయినట్టు తెలిపారు. అందుకే మళ్లీ భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు క్లారిటీ ఇస్తున్నట్టు తెలిపారు. ఇకపై ఇలాంటి పనులు మానుకోవాలని కోరింది. మొత్తానికి ప్రీతీ జింటా క్లారిటీ ఇవ్వడంతో ఆరోపణలకు అడ్డుకట్ట పడింది. ఇక ఇప్పటికే తనకు రాజకీయాల్లో రావడం ఏమాత్రం ఇష్టం లేదని బదులిచ్చింది. ప్రస్తుతం సన్నీ డియోల్ తో కలిసి 'లాహోర్ 1947' చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ జరవేగంగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











